తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో యాక్టర్ మనోజ్, స్మితల వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే నటుడు మనోజ్ అనగానే కార్తీక దీపం సీరియల్ యాక్టర్ మనోజ్ కుమార్ కాల్పులు జరిపినట్టుగా ఒక వార్త వైరల్ అయ్యింది.
అయితే విషయం తెలిసిన యాక్టర్ మనోజ్ కుమార్ ఈ ఇన్సిడెంట్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను హైదరాబాద్ లో లేనని క్లారిటీ ఇచ్చాడు. మరి అసలు మనోజ్ ఎవరు? ఆ స్టోరి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజ్ ను ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు హాజరు పరచడం, రిమాండ్‌లోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు షాకింగ్ విషయాలు ఉన్నాయి. సమయం కథనం ప్రకారం, సిద్ధార్థ్ దాస్‌తో స్మితతో 2003 లో పెళ్లి జరిగింది. వీరికి 17 సంవత్సరాల కుమారుడు, 13 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. వీళ్లు గతంలో మూసాపేటలో నివసించేవారు. ఈ క్రమంలో సిద్ధార్థ్, స్మితల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో స్మిత 2018లో సిద్ధార్థ్ పై గృహహింస కేసు పెట్టింది.
ఆ తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఇద్దరు అప్పటి నుంచి వేరుగా ఉంటున్నారు. మానసిక సమస్యలతో, ఒత్తిడితో ఇబ్బంది పడే వారికి స్మిత కౌన్సిలింగ్ ఇస్తుండేదని, ఈ క్రమంలోనే యాక్టర్ మనోజ్ కు స్మితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లో ఉన్న మనోజ్, స్మిత దగ్గరికి కౌన్సిలింగ్‌కు వచ్చేవాడు. అలా వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరు 3 సంవత్సరాలుగా పిల్లలతో కలిసి శామీర్ పేటలో ఉండే సెలబ్రిటీ విల్లాలో ఉంటున్నారు.
మనోజ్ తమన వేధిస్తున్నాడని స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశాడు. సీడబ్ల్యూసీ వాళ్లు వారి తండ్రి సిద్ధార్థ్‌ను హైదరాబాద్ పిలిపించారు. సిద్ధార్థ్ దాస్ శనివారం పిల్లల కోసం సెలెబ్రిటీ విల్లాకు వెళ్ళాడు. సిద్ధార్థ్‌ను చూసిన స్మితా మనోజ్‌కి చెప్పడంతో ఆగ్రహించిన మనోజ్ ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరిపాడు. గన్ చూసి భయపడిన సిద్ధార్థ్ బయటికి వచ్చి, డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మనోజ్‌ను అరెస్ట్ చేశారు. ఏయిర్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: కథ ఒకటే… కారణాలు వేరే..! ఏం జరిగిందంటే..?




భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని అన్వేషణ కోసం 2008లో చంద్రయాన్-1 ను ప్రయోగించింది. ఇది మూన్ పై నీరు ఉందని రుజువు చేసింది. ఆ తరువాత చంద్రుని పై ల్యాండింగ్, అన్వేషణ కోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, 2019లో ప్రయోగించారు. కానీ సాంకేతిక లోపం వల్ల చంద్రయాన్-2ను మోసుకెళ్లిన ల్యాండర్ ల్యాండింగ్‌లో ఫెయిల్ అయ్యి చంద్రుడి పై కూలిపోయింది. ఈసారి సాంకేతిక లోపం తలెత్తకుండా చంద్రయాన్ 3ని ఇస్రో సిద్ధం చేసింది.
శాస్త్రవేత్తలు గతంలో మాదిరిగా జరగాకుండా ఉండేందుకు చాలా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. అంటే ప్రొపల్షన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉండే రోవర్ ల్యాండర్ ను చంద్రుని పై 100కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుని కక్ష్య నుండి చంద్రున్ని, భూమిని, అధ్యయనం చేయడం కోసం ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రుని ఉపరితలం నివాస యోగ్యమో, లేదో తేల్చడం కోసం, చంద్రుని పై జరిగే మార్పులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఇప్పటి వరకు చాలా దేశాలు చంద్రుని ఉత్తర ధ్రువం పై ఎన్నో పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం ఇప్పటిదాకా చంద్రుని పై ఎవరు అడుగుపెట్టని దక్షిణ దిశను చేరాలనే ప్రయత్నిస్తోంది. అక్కడ భారత జెండాను పెట్టనున్నారు. చంద్రయాన్–1 నుంచి చంద్రయాన్–3 వరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ఇస్రో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు ప్రాంతంలో చంద్రయాన్–3 ల్యాండర్‌ను దించనున్నారు. యావత్ ప్రపంచం చంద్రయాన్ 3 కోసం ఎదురుచూస్తోంది.





హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్, సట్లేజ్, రావి లాంటి నదులు ప్రమాదకర స్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ నదుల పై నిర్మించిన రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఆ రిజర్వాయర్ల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. వాటి ప్రభావం వల్ల బియాస్, సట్లేజ్, రావి తీరప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష మందికి పైగా ప్రజలను ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పలు పట్టణాలు కూడా సగం వరకు మునిగాయి. బిలాస్పూర్, కాంగ్రా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, ఉనా, మండి, హమీర్పూర్, కుల్లు-మనాలి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురావడంతో కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
వర్షాలు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజులలో భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 72 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. నాలుగు వేల కోట్లు విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డిపార్ట్మెంట్ తెలిపింది.
అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తరహ ఘటన యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది. కాన్పూరులో నివసించే అర్జున్ సింగ్, సవిత మౌర్యలు భార్యాభర్తలు. ఈ జంటకి 2017లో పెళ్లి జరిగింది. భార్యకు చదువు పట్ల ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అర్జున్ సింగ్, సవిత మౌర్యను అప్పులు చేసి మరి నర్సింగ్ చదివించాడు.
నర్సింగ్ పూర్తి అయిన తరువాత సవిత మౌర్యకు మెడికల్ డిపార్ట్మెంట్ లోనే గవర్నమెంట్ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండు మూడు నెలల తరువాత సవిత మౌర్య ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఇక అప్పటి నుండి భర్త అర్జున్ సింగ్ ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె మరో గదిలో నిద్రపోతుండడంతో అర్జున్ సింగ్ భార్యను నిలదీశాడు. దాంతో సవిత భర్తను నల్లగా, పొట్టిగా ఉన్నవంటూ, నీలాంటి భర్తతో ఉండలేనని చెప్పడంతో అర్జున్ షాక్ అయ్యాడు.
సవిత అర్జున్ సింగ్ నుండి విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. కానీ అర్జున్ సింగ్ మాత్రం తనకు భార్య సవిత కావాలని పోరాడుతున్నారు. భార్య చదువుకు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, అప్పును కూలీ పనులు చేసుకుంటూ తీరుస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనకు న్యాయం కావాలని అర్జున్ సింగ్ వేడుకుంటున్నాడు.