కరోనా కారణం గా విమాన రవాణా వ్యవస్థ కొంత నెమ్మదించినా.. ప్రస్తుతం విమాన ప్రయాణాలు కూడా ఎక్కువ గా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యం లో విమానం లో ప్రయాణించేముందు అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే, కొన్ని నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. అలానే, నిబంధనలు అతిక్రమిస్తే.. మనల్ని “నో ఫ్లయింగ్ లిస్ట్” లో పెట్టేస్తారు. అసలు “నో ఫ్లయింగ్ లిస్ట్” అంటే ఏమిటి..? విమానాల్లో ప్రయాణించాలంటే ఏ ఏ నిబంధనలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
రాకేష్ ధన్నారపు రాసిన ‘101 ఫ్లైయింగ్ సీక్రెట్స్’ ప్రకారం విమానాలలో ప్రయాణించే వారు కచ్చితం గా కొన్ని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అవి పాటించకపోతే మాత్రం వారిని “నో ఫ్లయింగ్ లిస్ట్” లోకి చేరుస్తారు. ఫలితం గా, వారు ఇక పై విమానాలు ఎక్కలేరు. ఇది మొట్ట మొదటగా అమెరికా లో మొదలైంది. రెండేళ్ల క్రితం భారత్ దేశం లో కూడా ప్రారంభం అయింది. ఎయిర్ పోర్ట్ లో కానీ, విమానం లో ఉన్నపుడు కానీ అసభ్యం గా కానీ, అమర్యాద గా కానీ ప్రవర్తించకూడదు. అలా చేస్తే, వారిపై నిషేధం విధిస్తారు.
ఒకవేళ ప్రయాణం లో ఉండగానే, ఎవరైనా మితి మీరి ప్రవర్తిస్తే.. వారిని విమానం లో ఉండే సిబ్బంది టేపులతో బంధించవచ్చు.. లేదంటే ప్రత్యేక సీటు బెల్టులతో బంధించడానికి కూడా అనుమతులు ఉంటాయి. దీనినే, ‘మిడ్ ఎయిర్ అరెస్ట్’ అని పిలుస్తారు. ఆ తరువాత విమానం ల్యాండ్ అయ్యాక సంబంధింత పోలీసులకు సమాచారం అందిస్తారు.
నేరం రుజువయ్యాక వారిపై నిషేధం విధిస్తారు. నేర తీవ్రతను బట్టి నిషేధ కాలం ఉంటుంది. అమెరికా లో 2007లో 40 మంది ఈ జాబితాలో చేరారు. ఆ తరువాత 2011లో 78 మంది నమోదయ్యారు. అదండీ సంగతి.. కాబట్టి విమానం లో ప్రయాణించేటపుడు తప్పనిసరి గా నిబంధనలను పాటించాలి. ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడకుండా.. వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండాలి.
Note: images used in this article are only for representative purpose. But not the actual characters