మనం నిద్రపోతున్న కూడా మన మెదడు పని చేస్తున్నప్పుడు వచ్చేవే కలలు. మనిషికి కలలు రావటమనేది ఎంతో సహజం. కలల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని భయపెట్టే ఇంకొన్ని ప్రమాదకరమైనవి. కొన్ని కలలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు.
అంటే పైన చెప్పిన రకాల్లో మనకొచ్చిన కల ఏ కోవకు చెందుతుందో తెలియని కలలు కూడా ఉంటాయి. మనం పదే పదే దేని గురించి అయినా తలుచుకుంటూ ఉండడం వల్లనో కలలు వస్తుంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని సార్లు కలలు అస్సలు సంబంధం లేకుండా కూడా వస్తుంటాయి.
మీకెప్పుడైనా ట్రాన్స్ జెండర్లు కలలోకి వచ్చారా..? వారు ఎందుకు అలా కలలో కనిపిస్తారు అన్న సంగతి మీకు తెలుసా..? చాలా మంది ట్రాన్స్ జెండర్లు తమ కలల్లో కనిపించగానే తమకి ఏదో జరిగింది అని భావించేస్తూ ఉంటారు. తాము కూడా అలా మారిపోతామా?? అని అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే.. ఇలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రాన్స్ జెండర్లు కలలోకి వస్తే ఏమి జరుగుతుందో.. కలల శాస్త్రంలో ఏమి చెప్పబడిందో చూద్దాం.
సాధారణంగా ఈ భయం మగవారిలోనే ఎక్కువగా ఉంటుందట. కానీ భయపడాల్సిన అవసరమే లేదట. కలల శాస్త్రం ప్రకారం.. ట్రాన్స్ జెండర్ కలలోకి వస్తే.. ఫలితాలు పాజిటివ్ గా ఉంటాయట. మీ అంతర్గతంగా దాగి ఉన్న శారీరక శక్తిని ఆ కల చూపిస్తుందని.. ఇది మంచి శకునమేనని చెబుతున్నారు. అదృష్టం, విశ్వాసం, శ్రేయస్సు, విజయం వంటి వాటిని ఈ కల సూచిస్తుందన్నారు.ఈ కలకి మరో అర్ధం ఏంటంటే మీ జీవితంలో అనవసరమైన విషయాలను పక్కకు జరిపి.. ముఖ్యమైన విషయాలకు చోటు కల్పించాలని అర్ధం.
ఒకవేళ పెళ్లి కాని వారికి ట్రాన్స్ జెండర్ కనిపిస్తే.. వారికి త్వరలోనే వివాహ యోగం ఉందని అర్ధమట. కలల శాస్త్రం ప్రకారం.. ట్రాన్స్ జెండర్ కలలో కనిపిస్తే అమ్మతో అనుబంధం.. అమ్మ తరపు చుట్టాలతో అనుబంధం మెరుగు పడడానికి దోహదం చేస్తుందని అర్ధమట. అమ్మ తరపు కుటుంబం నుంచి మిమ్మల్ని సాయం కోరే వారు ఉంటారట. అలాగే.. మీరు ఫామిలీ మ్యాన్ గా ఎదుగుతున్నారని చెప్పడానికి ఈ కల సంకేతంగా నిలుస్తుందట.