సాధారణంగా మనం టాయిలెట్స్ ని చూస్తే టాయిలెట్లు ఎప్పుడూ తెల్లగానే ఉంటాయి. మరి ఏ ఇతర రంగులను కూడా టాయిలెట్స్ లో ఉపయోగించరు. అయితే చాలా మందికి అనుమానం ఉంటుంది. ఎందుకు బాత్రూం సీట్స్ తెల్లగానే ఉంటాయి అని..? అయితే మరి దాని వెనక ఉండే కారణం గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ బాత్రూమ్ సీట్లను పార్స్లీన్ అనే సిరామిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఈ మెటీరియల్ తెల్లటి రంగులో ఉంటుంది.
ఒకవేళ కనుక దీని మీద మనం మరే ఇతర రంగుని అయినా వేశామంటే దాని యొక్క ధర కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఇది ఎక్కువ ధర ఉంటుంది. పైగా దాని మీద మళ్ళీ రంగు వేస్తె ధర మరెంత పెరుగుతుంది. దీనితో ఎవరూ తీసుకోరు. పైగా తెల్లటి రంగు పరిశుభ్రతను సూచిస్తుంది.
అయితే ఈ మెటీరియల్ తో చేసిన బొమ్మలు వంటివి కింద పడితే విరిగి పోతూ ఉంటాయి. మరి ఇంత వీక్ మెటీరియల్ తో ఎందుకు బాత్రూం సీట్లని తయారు చేస్తారు అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే నిజానికి వీటిని పడేస్తే విరిగి పోతాయి కానీ ప్రెస్ చేస్తే ఏమీ అవ్వదు. సాధారణంగా మనం వీటి మీద కూర్చుంటూ ఉంటాము కాబట్టి ప్రెస్ చేసినా విరిగి పోవు.
ఈ యొక్క మెటీరియల్ కి గ్రేట్ కంప్రెసర్ స్ట్రెంత్ ఉంటుంది. అలాగే వీటికి తుప్పు కూడా పట్టదు. బాత్రూంలో నీళ్లతో ఎక్కువగా తడుస్తూ ఉంటుంది కాబట్టి తుప్పు పట్టకుండా ఉన్న దాన్ని మనం ప్రిఫర్ చేయాలి. దీని కంటే మంచి మెటీరియల్ మరేదీ ఉండదు. పైగా తెల్లటి రంగులో ఉంటాయి కాబట్టి మరకలని ఈజీగా చూసి క్లీన్ చేసుకోవడానికి కూడా అవుతుంది. అందుకే ఇవి వైట్ కలర్ లో ఉంటాయి.