మామిడాల యశస్విని రెడ్డి …ఇప్పుడు తెలంగాణలో మారుమోగుతున్న పేరు ఇది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు మీద యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఇరవై ఆరేళ్ల వయసున్న యశస్విని రెడ్డి తన వయసు కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న దయాకర్ రావు రాజకీయ జీవితానికి చెక్ పెట్టారు.
అయితే తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటును ఝాన్సీ రెడ్డి ఆశించారు. ఝాన్సీ రెడ్డి ఎన్నారై. ఆమెకు విదేశాల్లో పలు వ్యాపారాలు, కంపెనీలు ఉన్నాయి. అయితే ఎప్పటినుండో ఝాన్సీ రెడ్డి పాలకుర్తిలో పలు సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి దగ్గరవుతున్నారు. ప్రజలకి మరింత సేవ చేయాలని ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి సీటు ఆశించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఝాన్సీ రెడ్డికి సీటు కేటాయించింది. అయితే ఝాన్సీ రెడ్డికి భారతీయ పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆ సీటును ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డికి కేటాయించింది.
ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి ఎలాగైనా తన కోడలు యశస్విని రెడ్డిని గెలిపించాలని పట్టుదలతో పని చేసింది. రాజకీయ అనుభవం లేని యశస్విని రెడ్డి ప్రచారంలో కూడా పలుమార్లు చిన్న చిన్న తప్పిదాలు చేశారు. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అన్నారు. రాజకీయ ఉద్దండుడైన ఎర్రబెల్లి ముందు యశస్విరెడ్డి నిలబడుతుందా అంటూ పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తప్పుల నుంచి నేర్చుకుని పాలకుర్తి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుని కాదని పాలకుర్తి ప్రజలు ఈసారి యశస్విని రెడ్డికి పట్టం కట్టారు.
అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యశస్విని రెడ్డి బిగ్ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన అత్త రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానని తెలిపారు. తన అత్తకు పౌరసత్వాన్ని రాకుండా అడ్డుకున్నారు గాని వారసత్వం రాకుండా అడ్డుకోలేకపోయారని అన్నారు. మళ్లీ తనకు తిరిగి విదేశాలకు వెళ్లి ఉద్దేశం లేదని పాలకుర్తి ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంకితం అని చెప్పుకొచ్చారు.
పాలకుర్తి ప్రజల బాధలు దగ్గర నుండి చూసేసరికి చలించిపోయానని అన్నారు. తన ఆలోచన అంతా పాలకుర్తి ప్రజల అభివృద్ది గురించేనని స్పష్టం చేశారు. దగాకోరు దయాకర్ రావు వల్ల పాలకుర్తి ప్రజాలు చాలా ఇబ్బంది పడ్డారని,15 ఏళ్ల బాధని ఐదేళ్లలో తీరుస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. అలాగే తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పాలకుర్తి ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయమని అన్నారు.
https://www.instagram.com/p/C0rUggLJ-Xu/
watch video: