టీమ్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమి చెందిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఎప్పుడు సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టాడు.
వరల్డ్ కప్పు ఓడిపోయిన తర్వాత స్టేడియంలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియడం లేదని, వరల్డ్ కప్ ఓటమి బాధనుండి బయట పడేందుకు తన ఫ్యామిలీ,ఫ్రెండ్స్ ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చాడు. తమను ఎంతగానో ఎంకరేజ్ చేసిన అభిమానులను చూస్తే బాధేస్తుందని, కానీ జీవితంలో గెలుపు ఓటమి సహజమని వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలని చెప్పాడు.
https://www.instagram.com/reel/C0yJGIINfQH/
రోహిత్ పోస్ట్ చూసిన అభిమానులందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇండియా ఒకపక్క టి20 సీరియస్ లో నెగ్గుతుందని మాటే గాని ఆస్ట్రేలియాలో ఓటమి నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు. అభిమానుల గుండెల్లో ఆ ఓటమి ఇంకా మెదులుతూనే ఉంది. అయితే రోహిత్ శర్మ పోస్టుతో భారత్ అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ కి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. గెలిచిన ఓడిపోయిన ఎప్పుడు ఇండియన్ టీం వెనకాల మేము ఉంటామంటూ మద్దతు కనిపిస్తున్నారు. రాబోయే టి20 ప్రపంచ కప్ లో భారత్ తిరిగి పుంజుకోవాలని ఆశిస్తున్నారు.