దరిద్రం అంటే RCB దే అనుకుంటా.? టీం నుండి తీసేయగానే ఆ ప్లేయర్ సెంచరీ.! ఎవరంటే.?

దరిద్రం అంటే RCB దే అనుకుంటా.? టీం నుండి తీసేయగానే ఆ ప్లేయర్ సెంచరీ.! ఎవరంటే.?

by kavitha

Ads

విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా డిసెంబర్ 11వ తేదీన హర్యానాతో మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి క్వార్టర్ ఫైనల్ లో బెంగాల్ ఆటగాడు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ ప్లేయర్ అయిన షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ (118 బంతుల్లో 100 పరుగులు) చేశారు.

Video Advertisement

బెంగాల్ జట్టులో రెండవ అత్యధిక స్కోర్, అభిషేక్ చేసిన 24 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. దీన్ని బట్టి షాబాజ్ అహ్మద్ ఎలా ఆడారు అనేది చెప్పవచ్చు. మిగిలిన ప్లేయర్స్ అందరూ పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్నా కూడా షాబాజ్ అహ్మద్ మాత్రం ఒంటరి పోరాటం చేసి తన జట్టుకి స్కోర్ అందించడంలో సహాయం చేశారు.

shahbaz ahmed vht 2023

దాంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ లో రాణించడంతో షాబాజ్ అహ్మద్ మీద బెంగాల్ అభిమానులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరొకవైపు రాయల్ ఛాలెంజర్స్ జట్టుని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ తదుపరి సీజన్ వస్తుంది అన్న సంగతి తెలిసిందే. అయితే ఇతని స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ అయిన మయాంక్ దాగర్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకుంది. మయాంక్ కూడా ఆల్ రౌండరే.

shahbaz ahmed vht 2023

నిజానికి షాబాజ్ అహ్మద్ రిటైన్ చేసుకోదగ్గ ప్లేయర్. అయినా కూడా మయాంక కోసం ఇతన్ని వదిలేశారు. గత సీజన్ లో మయాంక్ మూడు మ్యాచ్ లలో కేవలం ఒక వికెట్ తీశారు. అయితే షాబాజ్ అహ్మద్ కూడా గత సీజన్ లో పేలవమైన ప్రదర్శన ఇచ్చారు. 5 ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే తీయగా, 6 ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశారు. మయాంక్ కోసం హైదరాబాద్ జట్టు 1.8 కోట్లు ఖర్చు చేసింది. మరొక పక్క బెంగళూరు జట్టు షాబాజ్ అహ్మద్ కోసం 2.4 కోట్లు వెచ్చించింది. దాంతో ఇప్పుడు, “ఇంత మంచి ఆటగాడిని ఎలా వదిలేసారు?” అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మీద కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : క్రికెట్ లో ఇక నుండి కొత్త రూల్… టి20 లో అమలు చేయనున్న ఐసిసి


End of Article

You may also like