ఈ ఫోటోలో ముగ్గురు హీరోలు ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ముగ్గురు హీరోలు ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సెలబ్రిటీలలో చాలా మంది స్నేహితులు ఉంటారు. వారిలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలలో, కొంత మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్నేహితులు అయ్యారు. మరి కొంత మంది ఇండస్ట్రీకి రాకముందే స్నేహితులుగా ఉన్నారు. కొంత మంది అయితే చిన్ననాటి నుండే ఒకరికి ఒకరు తెలుసు. వారిలో కొంత మంది బంధువులు అయితే, కొంత మంది కలిసి చదువుకున్న స్నేహితులు ఉంటారు. స్కూల్ సమయంలో కానీ, కాలేజ్ సమయంలో కానీ కలిసి చదువుకోవడం ఆ తర్వాత ఒకటే రంగంలో అడుగు పెట్టడం వంటివి అవుతూ ఉంటాయి. వారిలో ఇప్పుడు ఉన్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు.

Video Advertisement

actors in this picture

చిన్నప్పుడు కలిసి చదువుకొని, ఇప్పుడు కూడా స్నేహితులుగా ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో పైన ఉన్న ఫోటోలో ఉన్న సెలెబ్రిటీలు కూడా ఒకరు. ఇది స్కూల్ సమయంలో తీసుకున్న ఫోటో. ఇందులో స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అబ్బాయిలలో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా సినీ కుటుంబానికి చెందిన వారే. అయినా కూడా కష్టపడి వారికంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. వారే రానా దగ్గుబాటి, రామ్ చరణ్, అల్లు శిరీష్. ఈ ఫోటోలో ఆ ముగ్గురు ఉన్నారు. వాళ్ల ముగ్గురు కలిసి చదువుకున్నారు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి చిన్నప్పటినుండి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

actors in this picture

రానా దగ్గుబాటి తన పెళ్లికి కొంత మందిని మాత్రమే పిలిచారు. వారిలో రామ్ చరణ్, ఉపాసన కామినేని కూడా ఉన్నారు. అల్లు శిరీష్ కూడా వీళ్ళతో పాటే కలిసి చదువుకున్నారు. ఈ ఫోటోలో మొదటి వరుసలో ఉన్న అబ్బాయిలలో, ఎడమ వైపు నుండి ఐదవ వారు రానా దగ్గుబాటి, కుడి వైపు నుండి మూడవ వారు రామ్ చరణ్. రానా దగ్గుబాటి ఉన్న అదే ఐదవ స్థానంలో, మూడవ వరుసలో ఉన్న అబ్బాయి అల్లు శిరీష్. వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఇప్పటికి కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. బయట వీళ్ళందరూ కూడా చాలా స్నేహంగా ఉంటారు. ఒకరి సినిమాకి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.

ALSO READ : ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా..! ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు..!


End of Article

You may also like