ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా..! ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు..!

ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా..! ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు..!

by Mohana Priya

Ads

సినిమా కంటెంట్ బాగుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆదరిస్తారు. అందులోనూ మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే, భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని హిట్ చేస్తారు. ఇప్పుడు అలాగే జరిగింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపొందించిన సినిమాకి తగిన ఫలితం ఇప్పుడు వస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్. గత కొద్ది రోజుల నుండి ఈ పేరు వినిపిస్తూనే ఉంది. అందుకు కారణం ఆయన 10 సంవత్సరాలు తీసిన ఒక సినిమా. ది గోట్ లైఫ్ అనే ఒక సినిమాలో పృథ్వీరాజ్ నటించారు.

Video Advertisement

the goat life aadu jeevitham movie review

ఒక మనిషి ఎన్నో సంవత్సరాల పాటు ఎడారిలో తిండి లేకుండా, నీళ్లు లేకుండా ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఎన్నో సంవత్సరాలు టైం లైన్ ఈ సినిమాలో చూపించారు కాబట్టి, ఆ టైం లైన్ కరెక్ట్ గా అందుకోవడానికి పృథ్వీరాజ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఈ సినిమా షూట్ చేశారు. ఈ సినిమాలో ఒక సీన్ కోసం పృథ్వీరాజ్ నిజంగానే నీళ్లు తాగకుండా ఉన్నారు. శరీరంలో ఇంకా కొంత నీరు ఉంటే, అది ఇంకిపోవాలి అనే ఉద్దేశంతో షూట్ కి ముందు వోడ్కా తీసుకున్నారట.

ఆ సీన్ కోసం ఎలాంటి శరీరాకృతి అయితే కావాలో, అలాగే పృథ్వీరాజ్ తనని తాను మార్చుకున్నారు. కానీ ఓపిక లేకపోవడంతో షూటింగ్ లోకేషన్ కి కూడా చైర్ లో తీసుకెళ్లారు. సీన్ కోసం షాట్ తీసే ముందు చైర్ నుండి పృథ్వీరాజ్ ని కొంత మంది చైర్ లో నుండి తీసుకొచ్చి మళ్ళీ షాట్ అయిపోయాక చైర్ లో తీసుకెళ్లిపోయేవారు. కేవలం ఈ ఒకే ఒక్క ఎపిసోడ్ కూడా పృథ్వీరాజ్ మూడు రోజులు ఆహారాన్ని ముట్టలేదు. చివరి రోజు నీళ్లని ముట్టలేదు. ఇంత కష్టపడ్డారు కాబట్టి సీన్స్ చాలా ఒరిజినల్ గా కనిపించాయి. ఈ సినిమా ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ డాలర్ మార్క్ దాటింది.

ఇలా ఇంత వేగంగా వన్ మిలియన్ మార్క్ దాటిన మొదటి మలయాళ చిత్రంగా రికార్డ్ సాధించింది. ఇప్పటి వరకు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా విడుదల అయిన మూడు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం రోజు 15 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో, వీకెండ్ మొత్తం కలిపి 65 కోట్ల గ్రాస్ వచ్చింది. అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా చరిత్రలో నిలిచింది. కంటెంట్ బలంగా ఉంటే సినిమాకి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు సినిమాని ప్రశంసించారు. చాలా మంది ఈ సినిమాకి అవార్డులు కూడా వస్తాయి అని అంటున్నారు.

ALSO READ : పుష్ప “రష్మిక” నుండి… లైగర్ “అనన్య పాండే” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరోయిన్ పాత్రలు..!


End of Article

You may also like