రెండు భాషల్లో రీమేక్, ఇంకొక భాషలో డబ్బింగ్… కానీ ఈ సినిమాని కొట్టేదే లేదు..! ఈ సినిమా చూశారా..?

రెండు భాషల్లో రీమేక్, ఇంకొక భాషలో డబ్బింగ్… కానీ ఈ సినిమాని కొట్టేదే లేదు..! ఈ సినిమా చూశారా..?

by Mounika Singaluri

Ads

దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దుల్కర్ తన తండ్రి పేరు ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తో అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోగా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Video Advertisement

దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్ లో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.  దుల్కర్ కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. దాంతో దుల్కర్ మలయాళ సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దుల్కర్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన చార్లీ మూవీ గురించి ఇప్పుడు చూద్దాం..
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ మూవీ చార్లీ. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను 2016లో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు. ఈ మూవీ  మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వంలో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది. పార్వతి హీరోయిన్ గా నటించింది. 46వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఈ మూవీకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీతో పాటు మొత్తం 8 అవార్డులను గెలుచుకుంది. ఇతర భాషలలో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది.
చార్లీ కథ విషయానికి వస్తే, తేస్సా (పార్వతి) ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్. ఇష్టంలేని పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఇంటి నుండి పారిపోతుంది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ సహాయంతో, ఆమె పాత ఇంట్లో అద్దెకు తీసుకుంటుంది.  మొదట్లో, ఆ ఇంటిని  అసహ్యించుకుని, దానిని శుభ్రం చేసే క్రమంలో ఆ  గదిలో ఒక బుక్  దొరుకుతుంది. అది చదవడం ద్వారా గతంలో చార్లీ (దుల్కర్) అనే వ్యక్తి ఆ గదిలో ఉండేవాడని, అతని గురించి చదివిన తరువాత అతనిలోని మంచి లక్షణాలు ఆమెను ఆకట్టుకుంటాయి.
అంతేకాకుండా ఆమె చిన్నప్పుడు విన్న కథకు సంబంధించిన పెయింటింగ్ ను అక్కడి గోడల పై చూస్తుంది. ఆ పెయింటింగ్ వేసింది చార్లీ అని తెలియయగానే ఎలాగైనా అతన్ని చూడాలనే ఆసక్తితో చార్లీని వెతుకుతూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? ఆమె చివరికి చార్లీని కలుసుకుందా? ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ.
దుల్కర్ సల్మాన్ చార్లీ పాత్రలో జీవించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చార్లీ సింపుల్, మరియు ఫీల్ గుడ్ ఫిల్మ్. ఈ మూవీ మాధవన్ హీరోగా తమిళంలో ‘మారా’ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ చిత్రానికి ఆహాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: KING OF KOTHA REVIEW : “దుల్కర్ సల్మాన్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like