డబ్బింగ్ సినిమాలతో, అలాగే డైరెక్ట్ తెలుగు సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి, ఆ తర్వాత సీతారామం సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : కింగ్ ఆఫ్ కొత్త
 • నటీనటులు : దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డ్యాన్స్ రోజ్ షబీర్, అనిఖా సురేంద్రన్, ప్రసన్న, నైలా ఉష.
 • నిర్మాత : దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్
 • దర్శకత్వం : అభిలాష్ జోషి
 • సంగీతం : జేక్స్ బిజోయ్
 • విడుదల తేదీ : ఆగస్ట్ 24, 2023

స్టోరీ :

సినిమా మొత్తం 1980 కాలంలో నడుస్తుంది. రాజు (దుల్కర్ సల్మాన్) ఒక ఫుట్ బాల్ ప్లేయర్. కానీ అనుకోని కారణాల వల్ల కొన్ని సమస్యల్లో పడి, వాటిని పరిష్కరించాలి అనే ప్రయత్నంలో ఆ ఊరినే ఏలే నాయకుడు అవుతాడు. అసలు ఒక ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు ఇలా మారడానికి కారణం ఏంటి?  రాజు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రాజుకి ఇబ్బంది కలిగించాలి అని చూసిన వాళ్ళు ఎవరు? నాయకుడు అయ్యాక రాజు ఏం చేశాడు? ఇవన్నీ కలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

king of kotha movie review

రివ్యూ :

ఈ మధ్య ప్రేక్షకులు కేవలం ఒక భాషా సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వట్లేదు. ఏ భాష సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే చూసి హిట్ చేస్తున్నారు. అందుకే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కేవలం ఆ సినిమా రూపొందిన భాషలో మాత్రమే కాకుండా మిగిలిన భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా మలయాళం సినిమాలు అంటే కంటెంట్ కి పెట్టింది పేరు. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్ మలయాళంలో, తమిళ్ లో, తెలుగులో, హిందీలో సినిమాలు చేశారు.

king of kotha movie review

దాంతో ప్రతి చోటా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇలాంటి ఒక స్టోరీ లైన్ ఉన్న సినిమాలు మనం చాలా చూశాం. ఇది కొత్తది ఏమీ కాదు. కానీ టేకింగ్ పరంగా డిఫరెంట్ గా ఉంటే సినిమా కచ్చితంగా బాగుంటుంది. ఈ సినిమా టేకింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలని పరిచయం చేయడంతోనే అయిపోతుంది. అసలు ఎవరు ఏంటి? ఆ పాత్రల పని ఏంటి? ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారు.

king of kotha movie review

కొంత వరకు ఆ ప్రయత్నం బాగుంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. మరి ఇది దర్శకుడు నిర్ణయం ఏమో కానీ, సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక స్లో పేస్ లో నడుస్తుంది. సాధారణంగా ఇలాంటి సినిమాలు చాలా ఇలా స్లోగానే నడుస్తాయి. ఇది కూడా అలాగే ఉంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజు పాత్రకి దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆ పాత్ర కోసం తనని తాను మార్చుకున్న తీరు, అలాగే ఒక్క కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం అనేది అభినందించాల్సిన విషయం.

king of kotha movie review

సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర నైలా ఉష పోషించిన పాత్ర. ఐశ్వర్య లక్ష్మి తన పాత్రకి తగ్గట్టు నటించారు. మిగిలిన అందరూ కూడా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమాకి ఒక హీరో దుల్కర్ సల్మాన్ అయితే మరొక హీరో సంగీత దర్శకుడు. పాటలకంటే కూడా జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిజంగా ఒక మంచి మ్యూజిక్ ఉంటే సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అని చూపించడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

king of kotha movie review

అలాగే మరొక హైలైట్ నిమిష్ రవి అందించిన సినిమాటోగ్రఫీ. నిజంగా 1980 లో జరిగే సంఘటనలు చూస్తున్నట్టుగానే ఉంటుంది. సెట్ డిజైన్ కూడా చాలా బాగుంది. కొత్త అనే ఒక నగరాన్ని చాలా బాగా రూపొందించారు. యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. కానీ కథనం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటులు
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • సినిమాటోగ్రఫీ
 • యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

 • తెలిసిన కథ
 • స్లోగా సాగే సెకండ్ హాఫ్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

స్లోగా సాగే సినిమా అయినా పర్వాలేదు అని ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టినట్టు అయితే ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఇష్టపడే వారిని అస్సలు నిరాశపరచదు. సినిమాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ తమ పని తాము పర్ఫెక్ట్ గా చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూపించడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఇటీవల కాలంలో వచ్చిన మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటిగా కింగ్ ఆఫ్ కొత్త సినిమా నిలుస్తుంది.

watch trailer : 

ALSO READ : “నిలబెట్టుకోలేకపోయాం..! దీనికి కారణం మనమే..!” అంటూ… “భోళా శంకర్” పై బేబీ ప్రొడ్యూసర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?