నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) ఇటీవల బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన మైక్ పట్టుకున్నప్పుడల్లా చిరంజీవి పైన ఉన్న అభిమానాన్ని చూపిస్తుంటాడు.

Video Advertisement

ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు  సందర్భంగా జరిగిన వేడుకలో మరోసారి మెగాస్టార్ పై ఉన్న ప్రేమను చూపించాడు. అయితే ఈ వేడుకలో మాట్లాడుతున్న క్రమంలో ‘భోళా శంకర్’ ప్లాప్ అవడం పై ఎస్‌కేఎన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నిర్మాత ఎస్‌కేఎన్ చదువుకునే రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా ఎంతో యాక్టివ్ గా ఉండటంతో  ఎస్‌కేఎన్ అల్లు శిరీష్ పిలిపించి మరి అల్లు అర్జున్ కి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడి, దొరికిన జాబ్ చేస్తూ, ఆ తరువాత హీరోలకు పిఆర్ చేసి, చివరకు ప్రొడ్యూసర్ గా మారాడు. ఇటీవల బేబీ మూవీతో విజయాన్ని  అందుకున్న ఎస్‌కేఎన్, ప్రొడ్యూసర్ గా కన్నా, మెగా ఫ్యాన్ గానే ఎక్కువగా కనిపిస్తుంటాడు.
సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి సందర్భంగా పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన పై తనకున్న అభిమానంతో ఎస్‌కేఎన్ మాట్లాడారు. మామూలుగానే ఎస్‌కేఎన్ పంచులతో ప్రేక్షకులని అలరిస్తాడనే విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో అదే స్థాయిలో స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో భోళా శంకర్ ప్లాప్ గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.
bhola-shankar“బాస్ రీఎంట్రీ తరువాత మునుపెన్నడూ లేనంత అందంగా కనిపించిన సినిమా భోళా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఎవరో ఏదో చెప్తే వారి ట్రాప్ లో పడి ఫ్యాన్స్ ఈ మూవీని ప్లాప్ డిజాస్టర్ చేసుకున్నారు అన్నట్టుగా ఎస్‌కేఎన్ మాట్లాడారు. ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అభిమాన స్టార్ ఏం చేసినా వీరాభిమానులకు నచ్చుతుంది. కేవలం అభిమానులకు మాత్రమే కాదు అయితే నచ్చాల్సింది ఆడియెన్స్ కూడా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యింది అనడంతో… ఈ నెటిజన్ తల్లి రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!