మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.

Video Advertisement

ఈ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యి, మొదటిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఈ మూవీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. కాగా తాజాగా ఈ మూవీ గురించి ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన మూవీ భోళాశంకర్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి బాగా నటించినప్పటికీ, కొన్ని సీన్ల వల్ల ఈ మూవీ నెట్టింట్లో ట్రోల్ అయ్యింది. ఆ సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.  అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసినా కూడా  అంతగా ఈ మూవీ ప్రభావం చూపెట్టలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక నష్టాలను మిగిల్చింది. ఆచార్య మూవీ కన్నా భారీ డిజాస్టర్ అనే టాక్ కూడా వచ్చింది.
అయితే ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో “ఈరోజు అమ్మని జైలర్ కి తీసుకెళ్ళా, సినిమా మొదలయ్యే ముందు పక్క స్క్రీన్ లో చిరంజీవి సినిమా ఆడుతుంది అని చెప్పా. అంతే ఆ తర్వాతి సెకను దానికి వెళితే అయ్యోపోయే కదా దీనికి ఎందుకు తీసుకొచ్చావు. సినిమా ఫ్లాప్ అయింది మా అంటే, చిరంజీవి సినిమా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అని అన్నారు. అదీ బాస్ అంటే” అని రాసుకొచ్చారు.

Also Read: “గుడుంబా శంకర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? దొరికిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారూ..?