“గుడుంబా శంకర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? దొరికిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారూ..?

“గుడుంబా శంకర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? దొరికిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారూ..?

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గుడుంబా శంకర్’. ఈ మూవీని ఆగష్టు 31న రీరిలీజ్ చేయబోతునట్లు చిత్ర నిర్మాత నాగబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు గుడుంబా శంకర్ రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

ఓటీటీలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి నెటిజెన్లు గతంలో వచ్చిన సినిమాలను చూస్తూ, వాటిలోని పొరపాట్లను లేదా ఒక సినిమా నుండి మరొక సినిమాకు ఉన్న కనెక్షన్లను గమనిస్తూ, వాటిని షేర్ చేస్తున్నారు. తాజగా గుడుంబా శంకర్ లోని ఒక సీన్ గురించి షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ అయిన అంజన ప్రొడక్షన్స్ లో గుడుంబా శంకర్ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీని పవన్ కెరీర్లో  ప్లాప్ మూవీగానే చెబుతుంటారు. కానీ ఈ చిత్రంలో కామెడీ సూపర్ అనే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీని ఆగష్టు 31న రీరిలీజ్ చేయనున్నట్లు నాగబాబు ప్రకటించారు. అయితే ఈ సినిమాను 2 రోజుల తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే ఒక ట్విట్టర్ యూజర్ గుడుంబా శంకర్ మూవీలోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలను, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ సేమ్ కాస్ట్యూమ్స్ ధరించినట్టు కనిపిస్తోంది. ఆ ఫోటోలకు ఆ యూజర్ ‘నీకు ఏం కాదు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి రాత్రి కళ్ళు కాంపౌండ్ కి వెళ్తాడు ఉస్తాద్’ అని రాసుకొచ్చారు.

Also Read: “సన్యాసి అయినా కూడా..!” అంటూ… స్పందించిన రజనీకాంత్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like