Home Sports Adda KAVYA MARAN: SRH ఓనర్ “కావ్య మారన్” గ్యారేజ్ లో 4 కాస్ట్లీ కార్లు ఏంటో తెలుసా.? వాటి స్పెషలిటీ ఏంటంటే.

KAVYA MARAN: SRH ఓనర్ “కావ్య మారన్” గ్యారేజ్ లో 4 కాస్ట్లీ కార్లు ఏంటో తెలుసా.? వాటి స్పెషలిటీ ఏంటంటే.

by Sainath Gopi

ఐపీఎల్ వచ్చింది అంటే మన అభిమాన క్రికెటర్లు ఎంత సందడి చేస్తారో, వారితో పాటు టీం యజమానులు కూడా అంతే సందడి చేస్తారు. అలా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ప్రతి మ్యాచ్ కి వచ్చి కూర్చుంటారు. కావ్య హైదరాబాద్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ కి వస్తారు. కావ్య ఒక మ్యాచ్ కి వెళ్ళారు అంటే, కెమెరా కళ్ళు అన్ని కూడా కావ్య మీదే ఉంటాయి. టీం సరిగ్గా ఆడనప్పుడు బాధపడడం, బాగా ఆడినప్పుడు ఆనందపడటం కూడా కెమెరాలో షూట్ చేస్తారు.

దాంతో ఒక టీం యజమాని ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అనేది కావ్యని చూస్తే అర్ధం అవుతుంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతను తీసుకున్నారు. మిగిలిన టీం యాజమాన్యం కావ్య కంటే ఎంతో అనుభవం కలవారు. కానీ కావ్య అవి ఏమి పట్టించుకోకుండా హైదరాబాద్ జట్టుని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కావ్య తండ్రి కళానిధి మారన్ ఎంత పెద్ద వ్యాపారవేత్త అనే సంగతి అందరికీ తెలుసు. సన్ టీవీ వీళ్ళదే.

kaviya maran decision in ipl 2024

అందుకే జైలర్ ఆడియో లాంచ్ వేడుకలో కూడా కావ్య మారన్ కుటుంబ సభ్యులు కనిపించారు. అప్పుడు కూడా అనిరుధ్ పాడుతున్నప్పుడు కావ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి చాలా మంది అభిమానులు అయిపోయారు. ఒక అభిమానిలాగానే అనిరుధ్ పాటలని కావ్య ఎంజాయ్ చేశారు. కావ్యకి సినిమాలు అంటే చాలా ఆసక్తి అని తెలుస్తోంది. సినిమాలతో పాటు, కార్లు అంటే కూడా కావ్యకు చాలా ఆసక్తి. కావ్య దగ్గర చాలా రకాల కార్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB:

కావ్య దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ఉంది. దీని ఖరీదు 12.2 కోట్ల రూపాయలు.

kaviya maran cars collection

#2 ఫెరారీ రోమా:

కావ్య దగ్గర ఫెరారీ కి చెందిన ఫెరారీ రోమా కార్ కూడా ఉంది. ఈ కార్ ని 2021 లో ప్రవేశపెట్టారు. దీని ఖరీదు 4.5 కోట్ల రూపాయలు.

kaviya maran cars collection

#3 బీఎండబ్ల్యూ ఐ7 :

కావ్య దగ్గర ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కార్ కూడా ఒకటి. దీని ఖరీదు 3.76 కోట్ల రూపాయలు ఉంటుంది.

kaviya maran cars collection

#4 బెంట్లీ బెంటేగా:

కావ్య దగ్గర ఉన్న ఖరీదైన కార్లలో ఇది కూడా ఒకటి. సాధారణంగా ఈ మోడల్ ధర 6 కోట్ల రూపాయల నుండి ప్రారంభం అవుతుంది.

kaviya maran cars collection

కావ్య మారన్ దగ్గర ఉన్న ఖరీదైన కార్లు ఇవే. ఇవి చూస్తూ ఉంటే కావ్యకి కార్లు అంటే ఎంత ఇష్టం అనే సంగతి కూడా అర్థం అవుతోంది.

ALSO READ : ఏంటి ధోని భయ్యా ఇది.? ఫాన్స్ వచ్చేదే నీ దర్శనం కోసం.! కెమెరా నీపై ఫోకస్ చేస్తే ఎందుకిలా చేసావ్?

You may also like