డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. గత కొద్ది సంవత్సరాల నుండి శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ అనే సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : మహావీరుడు
- నటీనటులు : శివకార్తికేయన్, అదితి శంకర్, సరిత.
- నిర్మాత : అరుణ్ విశ్వ
- దర్శకత్వం : మడోన్ అశ్విన్
- సంగీతం : భరత్ శంకర్
- విడుదల తేదీ : జులై 14, 2023.

స్టోరీ :
సినిమా కథ అంతా సత్య (శివకార్తికేయన్) అనే ఒక కార్టూనిస్ట్ చుట్టూ తిరుగుతుంది. సత్య తన తల్లి (సరిత), చెల్లి (మనీషా) తో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు. ఒక రోజు అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి మినిస్టర్ ఫండ్ డబ్బుతో కట్టిన ఒక హౌసింగ్ బోర్డ్ అపార్ట్మెంట్ కాలనీకి తీసుకెళ్తారు. కానీ ఆ అపార్ట్మెంట్ లో గోడలకు పెచ్చులు రావడం, పగుళ్లు రావడం జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ బిల్డింగ్ సరిగ్గా కట్టలేదు అని వారికి అర్థం అవుతుంది. సత్య ఈ విషయంపై పోరాడాలి అనుకుంటాడు కానీ తనలోని భయం తనని ఆపేస్తుంది.

తన చెల్లెలిని ఒకరు వేధించినా కూడా వారిని తిరిగి ఏమీ అనలేకపోతాడు. ఒక రోజు పొరపాటున బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతాడు. ఆ తర్వాత నుండి తనలో మార్పు మొదలవుతుంది. తనకి పై నుండి ఒక గొంతు (రవితేజ) వినిపించడం మొదలవుతుంది. ఆ గొంతు భవిష్యత్తులో ఏమవుతుంది అనేది సరిగ్గా చెప్తూ ఉంటాడు. దాంతో సత్య ఎదురు తిరిగి మినిస్టర్ జయకోడి (మిస్కిన్) చేసే తప్పుడు పనులని అడ్డుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్య కి వినిపించే ఆ గొంతు ఏంటి? ఆ గొంతు తను మాత్రమే ఎందుకు వింటాడు? ఆ తర్వాత సత్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో శివకార్తికేయన్ ముందు ఉంటారు. అలా ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ తో శివకార్తికేయన్ పని చేశారు. ఇప్పుడు అశ్విన్ తో పనిచేశారు శివకార్తికేయన్. అశ్విన్ అంతకుముందు మండేలా అనే ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించారు. కామెడీగా ఉంటూనే, ఒక మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ మీద వచ్చిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు లభించాయి.

దాంతో అశ్విన్ రెండవ సినిమా అయినా కూడా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే డైరెక్టర్ తన మార్క్ కామెడీతో కొన్ని సీరియస్ విషయాల గురించి మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలాంటి కథ ఎంత ఎక్కువ ప్రజలకు చేరితే అంత ఎక్కువ ఆదరణ లభిస్తుంది. శివకార్తికేయన్ ఇలాంటి సినిమా చేయడం అనేది చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక పక్క అమాయకంగా భయపడుతూ కనిపిస్తూనే, మరొక పక్క యాక్షన్ ఉన్న పాత్రలో శివకార్తికేయన్ బాగా నటించారు.

సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో పాత రజనీకాంత్ ని చూస్తున్నాం ఏమో అనిపిస్తుంది. ఇంక హీరో మదర్ గా నటించిన సరిత కూడా చాలా రోజుల తర్వాత తెరపై కనిపించారు. చాలా సహజంగా నటించారు. అలాగే మన సునీల్ కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు. హీరోయిన్ అదితి తన పాత్ర పరిధి మేరకు నటించారు. అలాగే ఈ సినిమాలో తెలుగు, తమిళ్ లో అదితి ఒక పాట కూడా పాడారు. అలాగే విలన్ పాత్ర పోషించిన ప్రముఖ దర్శకుడు మిస్కిన్ కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు.

తమిళ్ లో విజయ్ సేతుపతితో, తెలుగులో రవితేజతో వాయిస్ ఓవర్ ఇప్పించడం అనేది సినిమా బృందం తీసుకున్న మంచి నిర్ణయం. దాంతో మన రవితేజ గొంతు వింటున్నప్పుడు ఇది మన సినిమానే అని ఒక ఫీలింగ్ వస్తుంది, డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే డబ్బింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు కూడా బాగున్నాయి. డైలాగ్స్ కూడా ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమా డైలాగ్స్ లాగానే ఉన్నాయి. సినిమాకి మరొక ముఖ్య హైలైట్ కామెడీ.

యోగి బాబు, శివకార్తికేయన్ కి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. స్పెషల్ గా కామెడీకి అంటూ ఒక ట్రాక్ పెట్టకుండా, వారు చేసే పనుల్లోనే కామెడీ జనరేట్ అయ్యేలాగా రాశారు. ఒక మంచి కథ రాసుకుంటే సరిపోదు. అంతే బాగా తెరపై కూడా చూపించాలి. ఈ విషయంలో డైరెక్టర్ అశ్విన్ చాలా వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. అశ్విన్ రాసుకున్న పాయింట్ ఎంత బాగుందో, తెరపై చూపించిన విధానం కూడా అంతే ఆసక్తికరంగా ఉంది.

సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఇంకా దర్శకుడు ఆ పాయింట్ చూపించడంలో కూడా కొన్నిచోట్ల చిన్న చిన్న పొరపాట్లు అయ్యాయి ఏమో అనిపిస్తుంది. కానీ ఏదేమైనా అవన్నీ కూడా సినిమాలో కవర్ అయిపోతాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- శివకార్తికేయన్
- సెట్ డిజైనింగ్
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- ఎడిటింగ్
- నిడివి ఎక్కువగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
ఒక మంచి కథకి, మంచి దర్శకత్వం, మంచి నటీనటులు, అంతే గొప్పగా ఉండే నిర్మాణ విలువలు అన్నీ కలిస్తే ఒక సినిమా ఎంత బాగా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అవుతుంది. కమర్షియల్ సినిమా అయినా కూడా స్ట్రాంగ్ పాయింట్ తో వచ్చిన సినిమాల్లో ఒకటిగా మహావీరుడు సినిమా నిలుస్తుంది.
watch trailer :













బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జవాన్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవించందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రివ్యూ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 12సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని జాగ్రత్తగా, స్టోరీ అంతగా అర్ధమయ్యే అవకాశం ఇవ్వకుండా గ్రాండ్ విజువల్స్ తో ఎడిట్ చేశారు. షారుఖ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ యూట్యూబ్ ఛానల్ లో అన్ని లాంగ్వేజెస్ కి సంబంధించిన వెర్షన్లు పెట్టారు.
‘ఎవరు నేను, ఏవరిని కాను, తెలియదు. తల్లికిచ్చిన మాట కావచ్చు. నేరవేరని లక్ష్యం కావచ్చు’ అంటూ మొదలైన ప్రివ్యూ ఆద్యంతం షారుక్ డైలాగ్స్, లుక్స్, యాక్షన్ తో ఆకట్టుకుంది. ఇందులో షారుక్ పోలీస్ డ్రెస్ లో, ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. ఇక చివర్లో గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ మరియు ‘నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు’ అని చెప్పే షారుక్ డైలాగ్స్ ప్రివ్యూకి హైలైట్ గా నిలిచాయి.
విజయ్ సేతుపతి లుక్ బాగుంది. అయితే ఆయన పాత్రని రివీల్ చేయలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె యాక్షన్ షాట్ బాగుంది. స్టైలిష్ ఆఫీసర్ గా నయనతారను చూపించారు. ఇది ఇలా ఉంటే జవాన్ ట్రైలర్ ప్రివ్యూ పై సోషల్ మీడియాలో లు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
సాధారణంగా గుళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు వంటి ప్రదేశాల్లో భిక్షాటన చేసేవారు ప్రతిరోజూ కనిపిస్తూ ఉంటారు. సరైన తిండి, బట్టలు లేనివారిని చూడగానే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఎవరికి తోచినంత వారు ఎంతో కొంత దానం చేస్తుంటారు. కటిక పేదరికంలో ఉన్నవారే అలా మారతారు. తమ పొట్ట నింపు కోవడం కోసం బిచ్చ మెత్తుకుంటూ బ్రతుకుతుంటారని అందరికి తెలుసు. అయితే అలా వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడు అయినవారు ఉన్నారంటే ఆశ్చర్య పోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడు.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలో జీవిస్తున్న భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. భరత్ జైన్ ముంబైలో నివసిస్తాడు. అతనికి రూ. 1.4 కోట్ల ఖరీదు అయిన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన డబ్బును షాపుల్లో పెట్టుబడిగా పెట్టాడు. థానేలో 2 షాపులను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా అతనికి నెలకు 30వేల రూపాయల రెంట్ వస్తుంది. ఇక భారత్ జైన్ ఆస్తి విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజాగా లెక్కల ప్రకారం భరత్ జైన్ నెలవారీ ఆదాయం సుమారు లక్ష రూపాయలు.
2014 సంవత్సరం నాటికి భరత్ జైన్ భిక్షాటన ద్వారా ప్రతిరోజూ రూ. 2000 – 2500, నెలకు 75వేలు సంపాదించేవాడట. ఆర్థిక ఇబ్బందుల వల్ల భరత్ జైన్ చదువును కొనసాగించలేకపోయాడు. అతనికి పెళ్ళై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. భరత్ జైన్, అతని ఫ్యామిలీ పరేల్‌లో 1 BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివసిస్తున్నారు. తన ఫ్యామిలీలో మిగతావారు స్టేషనరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇంట్లోవారు భిక్షాటన వదులుకోమని ఎంత చెప్పినా, భరత్ జైన్ వినకుండా అదే పనిని చేస్తున్నాడు.

రివ్యూ:
భీమ్ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్ గా ఆశిష్ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్ పాత్రలో మమతా మోహన్‌దాస్ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్‌దాస్ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్ రావు పెద్ద భార్య మీరాబాయ్ క్యారెక్టర్ లో విమలా రామన్ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్ ఎస్ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.





ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు.
అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్లో నివసిస్తున్నారు.
1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉన్న సలార్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. దీనిని చూస్తుంటే కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే ఈ మూవీ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంది. ‘సింహం, ఏనుగు, చీతా చాలా ప్రమాదం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే అక్కడ ఉంది’ అని ఓ పెద్దాయన డైలాగ్ చెప్పినపుడు రెబల్ స్టార్ ప్రభాస్ పేరును చూపించారు.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. టీజర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ డీఫెరెంట్ లుక్ లో కనిపించారు. ఇది కేజీఎఫ్ లోని అధీరా లుక్ ను పోలీ ఉంది. టీజర్ లో ప్రభాస్ ను క్లియర్ గా చూపించలేదు. ప్రభాస్ విలన్స్ తో ఫైట్ చేస్తున్న సీన్స్ ను చూపించారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని టీజర్ చివరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటూ టీజర్ ఎండ్ లో వేశారు. ఇలా ఈ ఈ టీజర్ కేజీఎఫ్ తో రిలేటెడ్ గా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.