Ads
2020 సంవత్సరం ఒక్కొక్కరికి ఒక లాగ గడిచింది. ఈ సంవత్సరం ఎంతో మంది ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 2020 లో మనల్ని విడిచి వెళ్లిపోయిన కొంత మంది ప్రముఖులు వీళ్లే.
Video Advertisement
#1 ఇర్ఫాన్ ఖాన్
ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్, గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ 2020 లో మరణించారు.
#2 సుశాంత్ సింగ్ రాజ్ పుత్
బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణంపై విచారణ జరుగుతోంది.
#3 రిషి కపూర్
గత కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న రిషి కపూర్ గారు 2020 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
#4 సరోజ్ ఖాన్
సీనియర్ టాప్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గారు గుండెపోటుతో మరణించారు.
#5 ఎస్పీ బాలసుబ్రమణ్యం
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ, సెప్టెంబర్ లో స్వర్గస్తులయ్యారు.
#6 వాజిద్ ఖాన్
బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ సాజిద్-వాజిద్ లో ఒకరైన వాజిద్ ఖాన్ కరోనా వైరస్ తో వచ్చిన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ 2020 లో మరణించారు.
#7 జయ ప్రకాష్ రెడ్డి
జయ ప్రకాష్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు.
#8 చాడ్విక్ బోస్మన్
హాలీవుడ్ నటులు చాడ్విక్ బోస్మన్ కోలన్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు.
#9 శ్రావణి
తెలుగు సీరియల్ నటి శ్రావణి వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
#10 రావి కొండలరావు
సీనియర్ నటులు రావి కొండలరావు గారు గుండెపోటుతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ స్వర్గస్తులయ్యారు.
#11 వీజే చిత్ర
తమిళ సీరియల్ నటి వీజే చిత్ర వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
#12 నర్సింగ్ యాదవ్
ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన నర్సింగ్ యాదవ్ గారు కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా మరణించారు.
#13 కోసూరి వేణుగోపాల్
ఎన్నో సినిమాల్లో నటించిన వేణుగోపాల్ గారు కరోనాకి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
#14 చిరంజీవి సర్జా
కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా, గుండెపోటుతో మరణించారు.
#15 శ్రీ లక్ష్మి
రాజీవ్ కనకాల సోదరి, నటి శ్రీలక్ష్మి గారు క్యాన్సర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు.
#16 బసు ఛటర్జీ
సీనియర్ బాలీవుడ్ దర్శకులు బసు ఛటర్జీ గారు వయసు సంబంధిత సమస్యల కారణంగా జూన్ లో స్వర్గస్తులయ్యారు.
End of Article