దేవుడి సినిమాకి షాక్ ఇచ్చిన సెన్సార్ బృందం..! ఆదిపురుష్ పొరపాటు రిపీట్ అవ్వకుండా..?

దేవుడి సినిమాకి షాక్ ఇచ్చిన సెన్సార్ బృందం..! ఆదిపురుష్ పొరపాటు రిపీట్ అవ్వకుండా..?

by kavitha

Ads

దేవుళ్ల కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాల పై సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా చేయడానికి కారణం ‘ఆదిపురుష్’ మూవీ ఎఫెక్ట్‌ అని సమాచారం. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ దేవుడిగా నటిస్తున్న ‘ఓఎంజీ 2’ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ తప్పులు జరగకుండా వ్యవహరిస్తోంది.

Video Advertisement

‘ఓఎంజీ 2’ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.  తాజాగా ఈ సినిమా పై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
OMG-2-movie దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్‍దేవ్ కీలక  పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.

Also Read: ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా వస్తే ఎవరు మాట్లాడుకోవట్లేదు ఏంటి..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like