Ads
సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లడం అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో భాషలకు చెందిన సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రజలకి తమ వంతు సేవ చేశారు. అందులో కొంత మంది రాజకీయాల్లో సక్సెస్ కూడా అయ్యారు.
Video Advertisement
ఇప్పుడు కూడా చాలా మంది సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లారు.
అలాగే సీరియల్స్ లో నటించే వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అలా ఇటీవల ఒక యువ నటి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆమె పేరు చాహత్ పాండే. 2016 లో పవిత్ర బంధన్ అనే ఒక సీరియల్ తో తన కెరీర్ ని మొదలు పెట్టారు చాహత్ పాండే. ఆ తర్వాత ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించారు. హమారీ బహు సిల్క్ అనే ఒక సీరియల్ చాహత్ పాండేకి గుర్తింపు తీసుకొచ్చింది.
దాదాపు 15 కి పైగా సీరియల్స్ లో నటించారు. చాహత్ పాండేకి ఇప్పుడు 24 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు తాను సీరియల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆమ్ ఆర్మీ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ నుండి ఎన్నికల్లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ముందు చాహత్ పాండే పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధి కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తాను అని ఆమె పేర్కొన్నారు.
కానీ ఎలక్షన్స్ లో కేవలం 2275 ఓట్లు మాత్రమే గెలుచుకున్నారు. చాహత్ పాండే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. దాదాపు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉన్న చాహత్ పాండేకి బయట మాత్రం కేవలం 2275 రావడంతో అభిమానులు నిరాశ చెందారు.
అయితే మరి కొంత మంది మాత్రం, ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ప్రజలకు సేవ చేయాలి అనుకోవడం కూడా గొప్ప విషయం అని అభినందిస్తున్నారు.
https://www.instagram.com/p/Cz_hzHgI_id/
ALSO READ : ఇదెక్కడి ట్విస్ట్..ముకుంద పై సీరియస్ అయిన భవానీ..మురారి పెళ్లి ఫస్ట్ కార్డ్ ఎవరికో తెలుసా?
End of Article