SHARATHULU VARTHISTHAI REVIEW : 30 వెడ్స్ 21 “చైతన్య రావు” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SHARATHULU VARTHISTHAI REVIEW : 30 వెడ్స్ 21 “చైతన్య రావు” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Harika

Ads

30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు చైతన్య రావు. చైతన్య రావు ఆ తర్వాత నుండి చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన షరతులు వర్తిస్తాయి ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : షరతులు వర్తిస్తాయి
  • నటీనటులు : చైతన్య రావు మాదాడి, భూమి శెట్టి, నంద కిషోర్.
  • నిర్మాత : శ్రీలత – నాగార్జున్ సామల, శారద – శ్రీష్ కుమార్ గుండ, విజయ – డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
  • దర్శకత్వం : అక్షర కుమార్
  • సంగీతం : అరుణ్ చిలువేరు
  • విడుదల తేదీ : మార్చి 15, 2024

sharathulu varthisthai movie review

స్టోరీ :

చిరంజీవి (చైతన్య రావు) ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అతనికి తల్లితో పాటు, ఇద్దరు తోడ పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్లందరి బాధ్యత కూడా చిరంజీవి తీసుకుంటాడు. చిరంజీవి విజయశాంతి (భూమి శెట్టి) తో చాలా కాలం నుండి ప్రేమలో ఉంటాడు. చిరంజీవికి చిన్నప్పటి నుండి కూడా విజయశాంతి అండగా నిలుస్తుంది. ఆర్థికంగా జరిగిన ఒక సమస్య వల్ల చిరంజీవి జీవితం తలకిందులు అవుతుంది. ఆ సమస్య ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ఆ తర్వాత చిరంజీవి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

sharathulu varthisthai movie review

రివ్యూ :

మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్యలు, వాళ్లు రోజు ఎదుర్కొనే సంఘటనలు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు రిలేట్ అయ్యే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి. చాలా చోట్ల సినిమా చాలా డల్ గా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ బాగా తెర మీద కనిపించాలి అనే ఉద్దేశంతో మోతాదుకి మించి ఉన్నట్టు అనిపిస్తాయి. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఆ మెసేజ్ కూడా సరిగ్గా డెలివర్ చేయలేకపోయారు.

sharathulu varthisthai movie review

ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, చిరంజీవి పాత్రలో చైతన్య రావు చాలా బాగా నటించారు. సహజంగా అనిపించింది. భూమి శెట్టికి ఒక మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రలో తను ఇంకా బాగా నటించారు. అరుణ్ చిలువేరు అందించిన సంగీతం సినిమాకి తగ్గట్టు ఉంది. ఈ సినిమాకి ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రాఫర్లుగా పని చేశారు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ మోసాలపై, వాటి వల్ల జనాలు ఎదుర్కొనే సంఘటనలపై ఫోకస్ చేస్తూ సినిమా తీద్దాం అనుకున్నారు. పాయింట్ నిజంగా మంచి పాయింట్. కాకపోతే అది తెరమీద చూపించే విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • కొన్ని డైలాగ్స్
  • నటీనటుల పెర్ఫార్మన్స్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • డల్ గా సాగే స్క్రీన్ ప్లే
  • ఎమోషనల్ సీన్స్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు మిడిల్ క్లాస్ జీవితాన్ని సినిమాలో ఎలా చూపించారు అని తెలుసుకుందాం అనుకుంటే షరతులు వర్తిస్తాయి సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

 


End of Article

You may also like