సమంతని టార్గెట్ చేస్తూనే చైతు ఆ మాట అన్నాడా..? హాట్ టాపిక్ గా మారిన ఆ డైలాగ్ దేని గురించి?

సమంతని టార్గెట్ చేస్తూనే చైతు ఆ మాట అన్నాడా..? హాట్ టాపిక్ గా మారిన ఆ డైలాగ్ దేని గురించి?

by Anudeep

ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.

Video Advertisement

వీరిద్దరూ విడాకులు తీసుకున్న తరువాత స్పందించిన నాగ చైతన్య.. విడిపోయాక కూడా మేమిద్దరం హ్యాపీ గానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.

thank you 2

ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఆకట్టుకునే విధంగా ఉండడంతో.. ఈ టీజర్ విడుదల అయిన కొద్దీ సేపటిలోనే వైరల్ అయింది. ఈ టీజర్ లో నాగ చైతన్య చెప్పిన ఓ డైలాగ్ తెగ వైరల్ అవుతోంది.

thankyou new

“లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను..” అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. అయితే.. నాగ చైతన్య తన గోల్స్ పట్ల చాలా సీరియస్ గా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ డైలాగ్ ని సమంతని ఉద్దేశించే చెప్పారా..? అంటూ కొందరు లేని పోని అనుమానాలకు తావిస్తున్నారు. ఇందులో కెరీర్ కోసం చైతు పడుతున్న తపనే కనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమా చైతు కు మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.


You may also like