Ads
చాణక్య నీతి ప్రకారం చెప్పుకుంటే ఎవరైనా సరే స్నేహం విషయంలో కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. మంచి స్నేహితులు ఉంటే మన జీవితంలో అంతకంటే మంచి బహుమతి ఏదీ ఉండదు.
Video Advertisement
స్నేహితుడే శత్రువుగా మారితే అంతకుమించిన బాధ కూడా ఉండదు. అందుకే స్నేహం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చాణిక్యుడు తెలిపారు. చెడ్డ స్నేహితున్ని ఎప్పుడు కూడా నమ్మవద్దని, ఎందుకంటే ఇలాంటి వారు మీపై కోపం పెరిగినప్పుడు మీ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు తెలిపారు. సరైన స్నేహితుడు లేకపోతే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, స్వార్థపూరిత స్నేహితులకు దూరంగా ఉండాలని చాణక్యుడు తన నీతిలో తెలియజేశారు. మీ ముఖం మీదనే తియ్యగా మాట్లాడే వారిని నమ్మవద్దని, మీ ముందు అలా నటించి వెనకనుంచి వెన్నుపోటు పొడుస్తారని, నీకు హాని చేయాలని అనుకుంటారని ఆచార్య చాణక్యుని తెలిపారు.
స్వార్ధపరులు అత్యాశ గల వ్యక్తులు వద్ద ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, వారెప్పుడూ స్వార్ధం గురించి ఆలోచిస్తారని చాణక్య నీతి తెలియజేస్తోంది. వారి యొక్క స్వలాభం కోసం ఎవరినైనా మోసం చేస్తారని, వారి చుట్టూ ఎప్పుడైతే అలాంటి వ్యక్తులు చేరుతారో అతనికి హాని జరగడం ఖాయమని అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు సూచించారు.
End of Article