Ads
చంద్ర మోహన్ గారు అంటే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు.23 ఏళ్ళకి “రంగుల రాట్నం” సినిమాతో రంగ ప్రవేశం చేసారు.చందమామ రావే చిత్రానికి నంది అందుకున్న మొదటి హాస్య నటుడు చంద్ర మోహన్.
Video Advertisement
మల్లంపల్లి చంద్రశేఖర్ రావుగా 1943 మే 23 న ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా లోని పమిడిముక్కల అనే గ్రామంలో జన్మించారు.మేడూరు జడ్పీ హై స్కూల్ లో తన అభ్యాసం పూర్తి చేసుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల నుండి పట్టభద్రులు అయ్యారు.కళా తపస్వి కే.విశ్వనాధ్ గారు మరియు S.P బాల సుబ్రహ్మణ్యం గారు బంధువులు అవుతారు.
చిత్ర పరిశ్రమకి వచ్చిన తరువాత తన పేరుని చంద్ర మోహన్ గా పెట్టుకున్నారు. చంద్ర మోహన్ గారితో సినిమా చేస్తే ఆ హీరోయిన్ కి కలిసివచ్చి లైం లైట్ లోకి వస్తారు అని ఒక నమ్మకం.అప్పటి నుండి కథ నాయకుడిగా,సహా నాయకుడిగా హాస్య నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు.ముఖ్యంగా హాస్య పాత్రలు పోషించి దానిలో తన శైలిని నిరూపించుకున్నారు.
మొత్తం 175 సినిమాలలో ప్రధాన పాత్రలలో పోషించి మొత్తం 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో 900 కు పైగా సినిమాలలో నటించారు.తన సినీ ప్రస్థానం లో మొత్తం రెండు నంది అవార్డ్స్- చందమామ రావే కి మరియు అతనొక్కడే సినిమాకు గాను రాగ పదహారేళ్ళ వయస్సు కి గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.2017 లో కొన్నిసినిమాలు చేసి ఆ తరువాత సినీ రంగానికి దూరంగా ఉన్నారు.
చంద్రమోహన్ గారు తన భార్య తో తమ విశ్రాంత జీవితాన్ని పంచుకోగా వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర. జలంధర ప్రముఖ రచయిత్రి. దాదాపు 100 కి పైగా కథలు అలాగే కొన్ని నవలలు కూడా రాశారు. దీంతోపాటు సాహితి పురస్కారాలు కూడా అందుకున్నారు. జలంధర బి ఏ ఎకనామిక్స్ చదువుకున్నారు.
చంద్రమోహన్ కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ గా స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి డాక్టర్ గా చెన్నైలో స్థిరపడ్డారు. గత కొంత కాలంగా గుండె సమస్యతో బాధ పడుతున్న చంద్రమోహన్ గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం గుండె పోటుతో తుది శ్వాస విడిచారు.యావత్ సినీ పరిశ్రమ శోకంలో ఉన్నది. కాగా 13 వ తారీకు అనగా సోమవారం అంతిక్రియలు నిర్వర్తిస్తున్నారు.
End of Article