Ads
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. చంద్రబాబుకు బెయిల్ తీసుకురావాలని ఆయన తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే వాదోపవాదనలు జరుగుతున్నాయి తప్ప చంద్రబాబుకి బెయిల్ రావడం లేదు.
Video Advertisement
అయితే తాజాగా చంద్రబాబు నాయుడు జైలు నుండి రాష్ట్ర ప్రజల కోసం రాసిన లేఖ అప్పుడు వివాదం సృష్టిస్తుంది. లేఖలోని అంశాలను పక్కకు పెడితే ఇలా ఒక ఖైదీలు లేఖ రాయొచ్చా అంటూ అధికార వైసిపి మండిపడుతుంది.
ఒకసారి ఈ లేఖలోని సారాంశాన్ని చూస్తే… ఎలాంటి అవినీతి ముద్ర పడకుండా త్వరలోనే జైలు నుండి బయటకు వస్తానని చంద్రబాబు రాశారు. ట్రలతో నామీద అవినీతి ముద్ర వేయాలని చూసారు కానీ ఈ జైలు ఊచలు నన్ను ప్రజల నుండి దూరం చేయలేవు అని అన్నారు. నేను తప్పు చెయ్యను చెయ్యనివ్వను అంటూ లేఖలో ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోటి వైసిపి దాడులు చేస్తుందని, నేను లేని లోటును నా భార్య భువనేశ్వరి భర్తీ చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఈ లేఖని టిడిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది.
ఈ లేఖ పైన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు స్పందించారు. ముద్దాయిలు ఇలా లేఖను విడుదల చేయాలంటే ముందుగా జైలు అధికారులు పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న చంద్రబాబు లేఖకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.బ్రిటిష్ కాలం నాటి ప్రిజన్స్ యాక్ట్ 1900, ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ రూల్స్ ప్రకారం ఖైదీలు జైలు సూపరిండెంట్ పర్మిషన్ తో లేఖలు రాయొచ్చు. ఖైదీలు పంపించేటువంటి, స్వీకరించేటువంటి లేఖలు పై ఎటువంటి ఆంక్షలు లేవు.
ప్రభుత్వం వీరికి పోస్ట్ కార్డులు కూడా ఇస్తుందని కాకపోతే ఇవన్నీ సూపర్డెంట్ పర్మిషన్ తర్వాతే బయటికి వెళ్లాల్సి ఉంటుందని బార్ కౌన్సిల్ సభ్యులు తెలియజేశారు.జైల్లో ఖైదీలు రాసిన లేఖలను విభిన్న కేటగిరీలుగా విభజిస్తారు. వీటిలో ఫిర్యాదులను వేరు చేసి లీగల్ సర్వీస్ కు పంపిస్తారు. మిగతా వాటిని జెల్ సూపరిండెంట్ పరిశీలించి ఆయన అనుమతితో బయటకి పంపిస్తారు.
Also Read:“నేను బయట… ఆయన లోపల..!” అంటూ… “రామ్ గోపాల్ వర్మ” పోస్ట్..! ఏం అన్నారంటే..?
End of Article