Ads
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ మరియు కస్టడీ పిటిషన్ల పై తీర్పు ఈరోజుకి వాయిదా పడిన విషయం తెలిసిందే.
Video Advertisement
ఫైబర్ నెట్ కేసు, అమరావతి రింగ్ రోడ్డు కేసు మరియు అంగళ్లు కేసులలో చంద్రబాబు నాయుడు తరుపున వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద సైతం ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 30 రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో సెప్టెంబరు 10న అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబరు 5న మూడవసారి ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఫైబర్‌నెట్, అమరావతి రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A-24గా, అమరావతి రింగ్ రోడ్డు కేసులో A-1 గా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. అయితే సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మరో వైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తన పై రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరపున దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదీ బెంచ్ ముందు సీఐడీ తరపున లాయర్ రోహత్గీ, మాజీ సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదించారు. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. రాజకీయల వల్ల కక్ష సాధింపుకు పాల్పడకుండానే సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని లాయర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.
Also Read: సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
End of Article