సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!

by kavitha

Ads

న్యాయస్థానంలో వాది, ప్రతివాదుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగినప్పుడు రెండు వర్గాలలో ఒకరి పక్షమున ఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దమైన వాదనలు వినిపించేది  న్యాయవాది. చట్టంలోని విషయాల పట్ల పూర్తి అవగాహనతో పాటు మంచి వాదన పటిమ కూడా వుండాలి.

Video Advertisement

అయితే ఇటీవల వినికిడి లోపం ఉన్న ఒక మహిళా లాయర్ ఒక కేసును  సైగలతో వాదించారు. అయితే ఇలా సైన్​ లాంగ్వేజ్​లో ఒక కేసును వాదించడం ఇండియాలో ఇదే మొదటిసారి. అయితే సుప్రీంకోర్టులో వాదించిన మొదటి వినికిడి లోపం ఉన్న లాయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
వినికిడి లోపం ఉన్న లాయర్ల కోసం సంకేత భాష ద్వారా ఒక కేసు యొక్క విచారణను అనువదించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ సంచిత సీజేఐ డీవై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని బధిర లాయర్ సారా సన్నీ సైగల సహాయంతో వికలాంగుల హక్కులకు చెందిన కేసును వాదించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. సీజేఐ అనుమతించారు. దాంతో ఇండియాలో మొట్టమొదట, వినికిడి లోపం ఉన్న న్యాయవాది సారా సన్నీ, సంకేత భాషల సహాయంతో సుప్రీంకోర్టులో కేసును సమర్పించారు.
కలలను సాకారం చేసుకోవడానికి శరీరంలోని లోపం అడ్డుకాదని, నిరూపిస్తూ సారా సన్నీ సుప్రీంకోర్టులో వాదించి, భారత దేశ చరిత్రలో, మొదటిసారిగా వినికిడి లోపం ఉన్న న్యాయవాదిగా నిలిచింది. సారా సన్నీ సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు హాజరయ్యారు. సౌరభ్​ రాయ్‌ సాయంతో  కోర్టులో సైగలతో సారా సన్నీ మొదటిసారి వాదనలు వినిపించారు. కేరళలోని కొట్టాయం నుండి వచ్చిన సారా బెంగుళూరుకు చెందిన వినికిడి లోపం ఉన్న లాయర్.
ఆమె ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ మరియు హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సన్నీకి మరియ అనే కవల సోదరి కూడా ఉంది. ఇద్దరూ అక్కడే జ్యోతినివాస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. మరియ తన తండ్రి కెరీర్‌ను ఎంచుకుని, చార్టర్డ్ అకౌంటెంట్ వైపు వెళ్ళగా, సారా లాయర్ అయ్యింది. కేసు వాదించిన అనంతరం సుప్రీంకోర్టులో వాదించడం తన కల అని, అది ఇంత త్వరగా నిజం అవుతుందని ఉహించలేదని కోర్టులో తెలిపింది.

Also Read: పాకిస్తాన్ లో 16 ఏళ్లు నరకయాతన పెట్టినా కూడా భయపడలేదు..! దేశం కోసం పోరాడిన ఈ బ్లాక్ టైగర్ గురించి తెలుసా..?

 


End of Article

You may also like