పాకిస్తాన్ లో 16 ఏళ్లు నరకయాతన పెట్టినా కూడా భయపడలేదు..! దేశం కోసం పోరాడిన ఈ బ్లాక్ టైగర్ గురించి తెలుసా..?

పాకిస్తాన్ లో 16 ఏళ్లు నరకయాతన పెట్టినా కూడా భయపడలేదు..! దేశం కోసం పోరాడిన ఈ బ్లాక్ టైగర్ గురించి తెలుసా..?

by kavitha

Ads

చిన్నతనం నుండే దేశభక్తితో పెరిగిన ఆ వ్యక్తి, పాకిస్తాన్‌లో భారత గూఢచారిగా పనిచేసారు. 20 సంవత్సరాల వయసులోనే రా ఏజెంట్‌గా సేవలు అందించారు. దేశ, అంతర్జాతీయ అంశాలకు చెందిన సమాచారాన్ని సేకరించి, భారత దేశ భద్రతకు ఎంతగానో తోడ్పడ్డారు.

Video Advertisement

ఆయన దేశానికి అందించిన సేవలకు గాను అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ‘ది బ్లాక్ టైగర్’ బిరుదును ఇచ్చారు. భారత అత్యన్నత రా ఏజెంట్‌ గుర్తింపు పొందిన ఆ వ్యక్తి, పాకిస్తాన్‌లో గూడచారిగా పట్టుబడి, 16 సంవత్సరాలు దేశ రహస్యాలు చెప్పమని నరకం చూపించినా నోరు తెరవని దేశభక్తుడు. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం..
భారత అత్యన్నత రా ఏజెంట్‌ గుర్తింపు పొందిన ఆ వ్యక్తి వ్యక్తి పేరు రవీందర్ కౌశిక్. ఆయన 1952లో ఏప్రిల్ 11న హర్యానాలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండే దేశభక్తి ఉంది. రవీందర్ 23 సంవత్సరాల వయసులో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ లో చేరారు. అయితే పాకిస్తాన్ కు  “అండర్ కవర్” ఏజెంట్ గా వెళ్లేందుకు అందరూ వెనకడుగు వేయగా, తాను వెళ్ళతానని రవీందర్ ముందుకు వచ్చారు. ఆయన  పాకిస్థాన్ వెళ్ళే ముందు ఉర్ధూ నేర్చుకుని, ముస్లిం మతం కూడా మార్చుకున్నారు.
అహమ్మద్ షాకీర్ పేరు పెట్టుకుని, పాకిస్థాన్ కు 1975 లో వెళ్ళారు. అక్కడి వారికి సందేహం రాకుండా ఉండేందుకు కరాచి యూనివర్శిటీలో ఎల్ఎల్బి చేశారు. ఆ తరువాత పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నత పదవిలో చేరారు. పాక్ మహిళ అమానత్ ను పెళ్లి చేసుకున్నారు. 1979 – 1983 వరకు విలువైన సమాచారాన్ని రా, మరియు ఇండియన్ ఆర్మీకి పంపించేవారు. పాకిస్థాన్ ఇండియాను  దెబ్బ కొట్టాలనుకున్న ప్రతిసారి దేశానికి ముందుగా ఆ సమాచారం అందించి రక్షించేవారు.
అయితే మరొక రా ఏజెంట్  ఇన్యత్ మసిహా, పాకిస్తాన్ ఆర్మీ విచారణలో రవీందర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. దాంతో రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడ్డారు. అప్పటి నుంచి 16 ఏళ్ళ పాటు భారత్ సీక్రెట్స్ చెప్పమని రవీందర్ కౌశిక్ ను దారుణంగా హింసించారు. కాళ్ళకు, చేతులకు ఉన్న గోళ్ళను తొలగించి రక్తాలు వచ్చేలా సూదులతో గుచ్చేవారు. పళ్ళను రాయితో పగులగొట్టారు. ఇనుప శూలాలతో శరీరంలోని వివిధ భాగాలలో గ్రుచ్చి ఆయనకు నరకం చూపించారు. ఎన్ని విధాలుగా హింసించినా దేశ భక్తుడైన రవీందర్ కౌశిక్ దేశ రహస్యం ఒక్కటి కూడా చెప్పలేదట. ఎప్పటికైనా భారత ప్రభుత్వం రక్షిస్తుందని ఎదురు చూసిన రవీందర్ కు క్షయ వ్యాధి వచ్చి, 1999లో జూలై 26న కన్నుమూశారు. ఆయనని ఆ జైలు వెనుక ఖననం చేసారని తెలుస్తోంది. ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా బ్లాక్ టైగర్ అని బిరుదును ఇచ్చింది.

Also Read: “నీకు ఇంగ్లిష్ రాదు కదా..? ఉద్యోగం ఎలా చేస్తావు..?” అనే IPS ప్రశ్నకు… ఈ వ్యక్తి చెప్పిన సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

 


End of Article

You may also like