Ads
భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం బాగు కోసం చంద్రబాబు నాయుడు తన వంతు కృషి చేశారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు.
Video Advertisement
అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయాల గురించి మాత్రం అంత ఎక్కువగా ఎక్కడా మాట్లాడరు. ఒక సందర్భంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి సెప్టెంబర్ 10, 1981 లో వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి మద్రాస్ లోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో జరిగింది. పెళ్లి సమయానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ భువనేశ్వరితో పెళ్లి అన్నప్పుడు వెంటనే ఒప్పుకోలేదు. ఎప్పుడైతే పెళ్లి చూపులకి చంద్రబాబునాయుడు గారు వెళ్లారో, అప్పుడు భువనేశ్వరి గారితో ఇలా అన్నారట. “నేను ఒక పల్లెటూరి నుంచి వచ్చిన వాడిని. మంత్రి పదవి వస్తే సరే. లేకపోతే నేను తిరిగి పల్లెటూరికి వెళ్లి పోతాను” అని చెప్పారట.
అందుకు భువనేశ్వరి గారు, “భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి అని మా నాన్నగారు నాకు నేర్పారు” అని చెప్పారట. ఆ మాటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రేమలో పడ్డారట. కాని పెళ్ళికి మాత్రం చిన్న షరతులు పెట్టారు. “నాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు కానీ, ఈ పెళ్లిని చాలా ఘనంగా చేయండి” అని అడిగారు. అందుకు ఎన్టీఆర్ చిత్తూరులో ఉన్న ప్రతి గడపకి పెళ్లి శుభలేఖలను పంపించారు.
అంతే కాకుండా, తెలుగు, తమిళ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులని, రాజకీయ నాయకులని కూడా పిలిచి ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లిచూపుల్లో చంద్రబాబు నాయుడు గారు మూడు విషయాలు చెప్పారట. తాను ఆర్డినరీ కుటుంబం నుండి వచ్చాను అని, మంత్రి పదవి శాశ్వతం కాదు అని, మళ్లీ ఊరికి తిరిగి వెళ్ళిపోతే వెళ్లాల్సి రావచ్చు అని చెప్పారు. అందుకు భువనేశ్వరి గారు ఒప్పుకున్నారు.
watch video :
End of Article