అప్పుడు “నిన్ను కోరి”కి అదే కలిసొచ్చింది…కానీ ఇప్పుడు “నిశ్శబ్దం” కి అదే మైనస్ అయ్యింది.!

అప్పుడు “నిన్ను కోరి”కి అదే కలిసొచ్చింది…కానీ ఇప్పుడు “నిశ్శబ్దం” కి అదే మైనస్ అయ్యింది.!

by Mohana Priya

Ads

ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన నిశ్శబ్దం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. నిశ్శబ్దం సినిమాని ముందుగా థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. అందుకే లాక్ డౌన్ మొదలైన తర్వాత ఎన్నో సినిమాలు డిజిటల్ రిలీజవుతున్నా కూడా నిశ్శబ్దం బృందం మాత్రం థియేటర్స్ తెరుచుకునేంత వరకు ఆగుదాం అనుకున్నారు.

Video Advertisement

కోన వెంకట్ కూడా ఎన్నో సార్లు “ఈ సినిమా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అందుకే థియేటర్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

ఈ సినిమా కథ విషయంలో కోన వెంకట్ మార్పులు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కోన వెంకట్ అంతకు ముందు కూడా కొన్ని సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చూసుకున్నారు. ఆ సినిమాల్లో నిన్ను కోరి ఒకటి.

అసలు నిన్ను కోరి సినిమా మొత్తం భారతదేశంలోనే జరగాల్సి ఉందట. కానీ కోన వెంకట్ సెకండ్ హాఫ్ వేరే దేశం లో షూట్ చేద్దాం అని అన్నారట. ఇప్పుడు నిశ్శబ్దం సినిమా కూడా మొత్తం ఒక హిల్ స్టేషన్ లో ప్లాన్ చేశారట. కానీ ఇది కూడా ఫారిన్ కంట్రీ లో షూట్ చేద్దాం అనే ఐడియాని ప్రతిపాదించారు కోన వెంకట్.

అంతేకాకుండా నెగిటివ్ పాత్రలో నటించిన ఫారిన్ పోలీస్ ఆఫీసర్ ప్లేస్ లో మొదట వేరే యాక్టర్ ని అనుకున్నారట. కోన వెంకట్ ఆ పాత్రలో ఇప్పుడు నటించిన ఫారిన్ యాక్టర్ ని సెలెక్ట్ చేసారట. కానీ నిన్ను కోరి ఆకట్టుకున్నంతగా నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


End of Article

You may also like