క్యారెక్టర్ ఆర్టిస్ట్ “సత్య” గురించి చాలామందికి తెలియని విషయాలివే…బ్యాంకు ఉద్యోగం నుండి సినిమాల వైపు.!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ “సత్య” గురించి చాలామందికి తెలియని విషయాలివే…బ్యాంకు ఉద్యోగం నుండి సినిమాల వైపు.!

by Mohana Priya

Ads

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు సత్య కృష్ణన్. సినిమాల్లోకి రాక ముందు సత్య కృష్ణన్ హోటల్ మానేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి, తాజ్ గ్రూప్ అఫ్ హోటల్స్ లో ఉద్యోగం చేశారు. సత్య కృష్ణన్ ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అనుకున్నారు.

Video Advertisement

2000 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన డాలర్ డ్రీమ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తరువాత సత్య కృష్ణన్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పంజాగుట్ట లోని బిఎన్‌పి పరిబాస్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు.

satya krishnan in dollar dreams

మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత 2004 లో శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా కోసం సత్య కృష్ణన్ ని సంప్రదించారు. ఆనంద్ సినిమా లో సత్య కృష్ణన్ పోషించిన అనిత పాత్ర ద్వారా మనందరికీ ఇంకా చేరువయ్యారు. దాంతో సత్య కృష్ణన్ తన ఉద్యోగాన్ని వదిలేసి ఫుల్ టైం యాక్ట్రెస్ గా చేయడం మొదలు పెట్టారు.

ఆనంద్ సినిమాలో తన పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని అన్నారు సత్య కృష్ణన్ . ఈ సినిమాలో తన నటనకి నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, ప్రేమంటే ఇంతే, మొదటి సినిమా, ఉల్లాసంగా ఉత్సాహంగా, వినాయకుడు సినిమాల్లో నటించారు. లీడ్ రోల్ లో మొదటి సారిగా మెంటల్ కృష్ణ సినిమాలో నటించారు. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాతో మరింత సుపరిచితులు అయ్యారు సత్య కృష్ణన్.

ఇవి మాత్రమే కాకుండా అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, రెడీ, రక్ష, దడ, ఎందుకంటే ప్రేమంట, రచ్చ, దూకుడు, ఢమరుకం, బాద్షా, మనం, గోవిందుడు అందరివాడేలే, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, లండన్ బాబులు, రారండోయ్ వేడుక చూద్దాం, దేవదాస్, టాక్సీవాలా సినిమాల్లో నటించారు.

2020 లో వచ్చిన “హిట్” సినిమాలో చివరిగా మనకి కనిపించారు సత్య కృష్ణన్. సత్య కృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. కానీ తన భర్త తనని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు అని ఒక సందర్భంలో సత్య కృష్ణన్ చెప్పారు. సత్య కృష్ణన్ మరిన్ని మంచి పాత్రలతో మనల్ని అలరించాలని ఆశిద్దాం.


End of Article

You may also like