Ads
సినిమాల మీద ఇష్టంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చాడు ఛత్రపతి చంద్రశేఖర్. సినిమాల్లో నటించాలని అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో, సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చత్రపతి చంద్రశేఖర్. అయితే గుర్తింపు వచ్చినా ఇంకా తన ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు.
Video Advertisement
చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది చంద్రశేఖర్ కి. పదవ తరగతి తరువాత దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అక్కడ నటనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత రాజీవ్ కనకాల తో పాటు కొన్ని యాడ్స్ లో నటించాడు చంద్రశేఖర్. ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి యాక్టింగ్ స్కూల్ కి రావడం…
చంద్రశేఖర్ పరిచయం అవ్వడం జరిగింది. తన నటనను చూసి రాజమౌళి శాంతినివాసం సీరియల్ లో అవకాశం ఇచ్చాడు. విక్రమార్కుడు, ఛత్రపతి, బాహుబలి, యమదొంగ వంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాడు. ఛత్రపతి సినిమా తనకి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అప్పటినుండి ఛత్రపతి చంద్రశేఖర్ గా మారిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు ఇంకా తీరకపోవడంతో తన భార్యను కూడా మోడలింగ్ కోర్స్ లో చేర్పించాడు. శేఖర్ భార్య నీల్యా భవాని కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో శేఖర్ తెలిపారు. శేఖర్ ప్రస్తుతం సినిమాలతో పాటు, సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
End of Article