Ads
ఇటలీలో మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలలో బిజీగా ఉంది. కాప్టెన్ పార్టీతో మొదలైన ఈ పెళ్లి తంతు నిన్న మెహందీ హల్దీ ఫంక్షన్స్ పూర్తిచేసుకుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం ఇటలీ వేదికగా లావణ్య ,వరుణ్ ఏడు అడుగులు నడుస్తారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీతో పాటు చక్కగా మంది బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుంది.
Video Advertisement
టాలీవుడ్ నుంచి ఈ పెళ్లికి చాలా తక్కువ మంది హాజరవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే హీరో నితిన్ పెళ్లి వేడుకలకు అటెండ్ అవ్వడానికి కుటుంబ సమేతంగా ఇటలీ చేరుకున్నాడు. మరోపక్క చైతన్య ,సమంత కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. వీళ్లిద్దరు విడాకులు తర్వాత ఇప్పటివరకు ఒకే దగ్గర ఎదురుపడింది లేదు. ఎయిర్పోర్ట్లో పొరపాటున ఎదురుపడాల్సిన సందర్భాలు వచ్చిన వాటిని వాళ్ళు అవాయిడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా గడుపుతున్న సమయంలో సడన్గా డైవర్స్ తీసుకొని విడిపోయారు.అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే జంట కంటే కూడా.. విడాకులు తీసుకున్న ఈ మాజీ జంట ఈ ఫంక్షన్ లో ఏం చేస్తారు ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీరిద్దరూ వేరువేరు ఫ్లైట్లో ఇటలీకి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయం పెళ్లి ఫోటోలు వచ్చాక తెలుస్తుంది.
ALSO READ : స్టువర్టుపురం దొంగనుండి తప్పించుకున్న హీరో…. ఇంతకీ ఎవరు?
End of Article