రవితేజ హీరోగా మొదటిసారి చేసిన బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథని సినిమాగా తెరకెక్కించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు వసూలు సాధించింది. అయితే నిర్మాతలకు నష్టాలు తప్పవని టాక్ వినిపిస్తుంది. సినిమా నిడివి ఎక్కువ ఉండటం వల్ల ముందు రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.

Video Advertisement

తర్వాత వెంటనే సినిమా టీం 20 నిమిషాల నిడివిని తగ్గించింది. దీనివల్ల ఎంతో కొంత మేలు జరిగింది. దీనికి తోడు భగవంత్ కేసరి, లియో సినిమాలు కూడా పోటీగా ఉండడంతో డ్యామేజీ ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను చూసిన సినీ ఇండస్ట్రీ వర్గాలు స్టువర్టపురం దొంగ నుండి ఆ హీరో తప్పించుకుని మంచి పని చేశారని అంటున్నారు.

tiger nageswara rao movie review

పూర్తి విషయంలోకి వెళ్తే స్టువర్టుపురం దొంగ బయోపిక్ ఆఫ్ టైగర్ అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమాని ప్రకటించారు. మీకు గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రకటన కూడా వచ్చింది. రెండు సినిమాలకి క్లాష్ అవ్వడంతో కొన్ని చర్చల అనంతరం ఈ ప్రాజెక్టు నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస డ్రాప్ అయిపోగా రవితేజ సినిమా పట్టాలెక్కింది. తెర ఈ సినిమా రిలీజ్ అయ్యాక రవితేజ కి ఫలితం ఊహించినట్టు దక్కలేదు. ఒకవేళ ఇదే సినిమాని బెల్లంకొండ సాయి చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో అని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ స్టువర్టుపురం  దొంగ సినిమా నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తప్పించుకుని మంచి పని చేశారని అంటున్నారు. టాలీవుడ్ కి స్టువర్టుపురం కాన్సెప్ట్ అనేది కలిసి రాలేదు. చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత భానుచందర్ హీరోగా స్టువర్టుపురం దొంగలు సినిమాని తీశారు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత ఎవరూ స్టువర్టుపురం బ్యాక్ డ్రాప్ ని ఎంచుకునే సాహసం చేయలేదు.

 

Also Read:ఈ ఫోటోలో ఉన్న కళ్ళు ఒక పెద్ద హీరోవి..! ఎవరో చెప్పగలరా..?