చెప్పవే చిరుగాలి లో హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి..!

చెప్పవే చిరుగాలి లో హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి..!

by Megha Varna

Ads

చెప్పవే చిరుగాలి సినిమా లో వేణు సరసన నటించిన హీరోయిన్ అభిరామి గుర్తుందా..? టెలివిజన్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన అభిరామి 1995 లో సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. చెప్పవే చిరుగాలి సినిమా తరువాత ఆమె అంత గా తెలుగు తెరపై కనిపించలేదు.

Video Advertisement

చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసిన అభిరామి, 2004 వ సంవత్సరం లో ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్ళి 2013 లోనే ఇండియా కి వచ్చింది.

కథాపురుషన్ అనే మలయాళ సినిమా లో బాల నటి గా అభిరామి వెండితెర పైన కనిపించింది. ఆ తరువాత, పత్రం, న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్ , మేఘసందేశం వంటి మలయాళ సినిమాలు చేసింది.

ఆ తరువాత తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. రక్తకన్నీరు, లాలి హాడు వంటి కన్నడ సినిమాల్లో నటించింది. మిడిల్ క్లాస్ మాధవన్ , చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం, సమస్థానం వంటి తమిళ సినిమాలలో కూడా నటించింది.

abhirami 3

తెలుగు లో అభిరామి చాలా తక్కువ పాత్రలను చేసింది. చెప్పవే చిరుగాలి సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చెప్పవే చిరుగాలి కంటే ముందు ఆమె థాంక్యూ సుబ్బారావు సినిమాలో నటించింది. చార్మినార్ అనే మరో సినిమా లో కూడా అభిరామి నటించింది. ఇది కాకుండా, లేటెస్ట్ గా రవితేజ “అమర్ అక్బర్ ఆంటోని” సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అభిరామి నటించింది. ఈ సినిమా లో అభిరామి హీరో తల్లి పాత్రను పోషించింది.

abhirami 4

అయితే, సినిమాల్లోనే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అభిరామి తన సత్తా చాటింది. కమలహాసన్ ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ సినిమాలలో అభిరామి హీరోయిన్ పూజ కుమార్ కు తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పారు. ప్రస్తుతం తెలుగు లో సినిమాలు తక్కువే చేశారు. అప్పటికి, ఇప్పటికీ అభిరామి ఎలా మారిపోయారో ఈ కింద ఫోటోలలో చూడండి.

abhirami 1

abhirami 5 abhirami 6


End of Article

You may also like