అందుకే రజిని మేడం కి ఫాన్స్ ఎక్కువ…ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

అందుకే రజిని మేడం కి ఫాన్స్ ఎక్కువ…ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Anudeep

Ads

ఏంటయ్యా వ్యాపారం ఎలా సాగుతోంది.. అంతా బాగేనా అంటూ స్టార్ట్ చేసి.. ఎంత చెప్పాలయ్యా.. ప్రభుత్వం చెప్పేది మీ కోసమే కదా..మీరు ఆరోగ్యంగా ఉండాలనే కదా..మీరు ఈ రెండు రోజులు వ్యాపారం చేస్కోకపోతే డబ్బులు నష్టపోతారు.కాని ఆరోగ్యం పాడైతే పరిస్థితి ఏంటి?దానికి ఎవరిది బాధ్యత? మీరిలా చేయడం వల్ల కేవలం మీ ప్రాణాలే కాదు మీ కుటుంబ సభ్యలకు కూడా ప్రమాదం..కాబట్టి చెప్పిన మాట వినండి అంటూ రోడ్ పైన లస్సీ అమ్ముకుంటున్నవారికి నచ్చచెప్పి చేతిలో చెరో రెండు వేలు పెట్టి..జాగ్రత్తలు చెప్పి పంపిందామె..

Video Advertisement

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.. తీస్కెళ్లండి ఈ రెండు వేలు తీస్కోండి,అలాగే ప్రభుత్వం బియ్యం ఇస్తుంది, కూరగాయలు ఇస్తుంది ఒక రెండు రోజులు ఇంట్లో నుండి బయటకి రాకండి, లాక్ డౌన్ ఎత్తేశాక రెండు డబ్బాలు కాదు, నాలుగు డబ్బాలు పెట్టి అమ్ముదువు అప్పుడు ఎవరూ ఏం అనరు”అంటూ..ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు చిలకలూరి పేట ఎమ్మేల్యే విడదల రజనీ.

అమెరికాలో  సాప్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి వచ్చి , ఆంధ్రాలో రాజకీయాల్లో ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే ఎమ్మేల్యేగా ఎన్నికయి ఆ ప్రాంతానికి కొత్తతరం రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు.. యువతరం రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్టు చూపిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ గురించి, కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. రోడ్లపై ఎవరైనా కనపడినా ఎందుకు లాక్ డౌన్ పాటించాలి అని చాలా ఓపికగా వివరిస్తూ తను ప్రజల నాయకురాలిని అని నిరూపించుకుంటున్నారు రజిని.

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన తర్వాత MLA విడదల రజిని గురించి తెలిసిన కొన్ని విషయాలు అబ్బురపరిచాయి.. కరప్షన్ ఎట్టి పరిస్తితుల్లో అంగీకరించరు . ఇటీవల మధ్యాన్ని బ్లాక్ లో అమ్ముతున్న హెడ్ కానిస్టెబుల్ గురించి తెలియగానే , ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేస్కుని అది కన్ఫామ్ అని తెలిసాక , స్వయంగా అక్కడికి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ ని దుమ్ముదులిపేసింది.

అంతేకాదు మీడియా తన గురించి ఏదైనా నెగటివ్ గా రాస్తే, రాయండయ్యా నా  పాలనలోని లోపాల్ని ఎత్తి చూపిస్తేనే కదా , మరింత బాగా ఎలా పరిపాలించాలో నాకు తెలిస్తుంది కదా అని, తనపై వచ్చే వార్తల్ని పాజిటివ్ వేలో తీసుకుంటారని టాక్..మొత్తానికి ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ వీడియోపై మీరూ ఒక లుక్కేయండి.


End of Article

You may also like