Ads
ఎందరో చైల్డ్ ఆర్టిస్టులను చూశాం. కొందరు పిల్లలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే, మరికొందరకి అంతగా ఫాలోయింగ్ లేనప్పటికీ, తన నటనతో ఎందరో సీనియర్ నటులను ఆకట్టుకుంటున్నారు.
Video Advertisement
ఎంత ముద్దుగా ఉందో పాప, బలే చురుగ్గా, క్యూట్ గా నటిస్తుంది కదా అంటూ పాపని ఎత్తుకుని ఫోటోలు దిగుతున్నారు. ఇదంతా బైట ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినా, కొన్ని సినిమాల్లో ఉంది కదా ఈ పాప అని గుర్తు పడుతుంటారు. మరికొందరు అయితే ఇంత చిన్న వయసులోనే నటన ఇంత బాగా చేస్తే రాను రాను ఇంకెంత బాగా చేస్తుందో అంటూ పొగుడుతుంటారు.
అలా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి పెద్ద పెద్ద హీరోయిన్లుగా, సైడ్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. ఈ తరహాలోనే ఓ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. సుకుమార్ వంటి పెద్ద పెద్ద దర్శకులు కూడా ఈ చిన్నారి నటనకు ఏంటో ముగ్ధులయ్యారు. తాజాగా ఈ చిన్నారి, హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామమ్ సినిమాలో నటించింది. అదొక్కటే కాకుండా అనేక సినిమాల్లో కూడా నటించిందట.
ఇంతమందిని అలరిస్తూ, ఆకట్టుకుంటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎన్నో ఛానెల్స్ వారు కూడా రాసారట. ఇంత చిన్న వయసులో అంత పేరు ప్రఖ్యాతలు పొందిన చిన్నారి ఎవరో తెలుసా? ఆ చిన్నారి పేరు ఊహ రెడ్డీ. తన దెబుట్ సినిమా మహా సముద్రం. దాని తర్వాత పుష్ప, అశోక వనంలో అర్జున కళ్యాణం, పక్కా కమర్షియల్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఊహ సెట్ లో ఉందంటే చాలు ప్రతీ ఒక్కరికీ ముద్దుకుని దగ్గరకి తీసుకోవాలి అనిపించే అంత చలాకీగా ఉంటుంది.
హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా, ఆఖరికి మిస్ ఇండియా అయినా, ఊహా రెడ్డీ పాపను ఎత్తుకుని తీరుతారు. అంత ముద్దుగా ఉంటుంది మరి ఈ చిన్నారి. మాటలు కూడా అంతే చిలక పలుకులు లాగా ఉంటాయి. దీంతో చిన్న వయసులో ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళు చాలా మంది, భవిష్యత్తులో అనేక విజయాలను సాధించారు. ఇక ఈ ఊహా పాప కూడా అలానే సాధిస్తుందేమో అని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా, తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ, వెన్నంటే ఉంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఊహ తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నారు. తమ తోడు, ప్రోత్సాహం ఇలానే ఉండాలి అంటూ కొందరు పెద్దలు ఆశీర్వదిస్తున్నారు.
images sourced from : Instagram (uhareddy06_official)
End of Article