చైనాలోనే కాదు…మనదేశంలో కూడా గబ్బిలాలను తింటారంట..! ఎక్కడో తెలుసా?

చైనాలోనే కాదు…మనదేశంలో కూడా గబ్బిలాలను తింటారంట..! ఎక్కడో తెలుసా?

by Anudeep

కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది..అది ఎలా వచ్చింది..ఎందుకు వచ్చింది, దానికి నివారణ ఏంటి? అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల డాక్టర్లు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.. కానీ “కరోనా” అని పేరెత్తితే చాలూ.. చైనా అంటూ రాగం అందుకుంటున్నారు చాలామంది, వాళ్లు గబ్బిలాలు తినడం మూలంగానే కరోనా వచ్చింది అనేది WHO ఇచ్చిన ఆరోగ్య సూచనలకన్నా వేగంగా జనానికి చేరింది… కానీ కేవలం చైనాలోనే కాదు, మన దేశంలో కూడా గబ్బిలాలను ఆహారంగా తింటారు అనే విషయం మీకు తెలుసా?

Video Advertisement

ఆకుకూరలు మాత్రమే తినేవాడు చికెన్, మటన్ తినేవాన్ని కూడా ఇదే యాంగిల్లో చూస్తాడు ..వాడికి నచ్చకపోతే తిడతాడు..ఎవరి అలవాట్లు వారివి.. కానీ ఏధైనా విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ కి ఎక్కువ బలం చేకూరుతుంది.. సరే ఇప్పుడు టాపిక్ అది కాదు కాని ..మన దేశంలో వివిధ జాతులు,వివిధ తెగల వాళ్లున్నారు..వాళ్లు రకరకాల పండుగలు జరుపుకుంటుంటారు. అలాగే గబ్బిలాలను తినే పండుగ కూడా ఉంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని మిమి ప్రాంతవాసులు జరుపుకునే వింత పండుగ జరుపుకుంటారు..

మిమిలో అక్టోబర్ నెల మధ్యలో జరిగే ఈ పండుగలో బోమర్ తెగ ప్రజలు పాల్గొంటారు.. ఆ పండుగ స్పెషల్ ఏంటంటే  “పండుగ కాలంలో గుహల్లో వెతికి గబ్బిలాలను పట్టుకోవడమే లక్ష్యం, తర్వాత వాటిని వండి తినడం పండుగ లక్షణం” మిమిలో సుమారు 300 నుండి 400 అడుగుల ఎత్తులో నాలుగు పెద్ద గుహలు ఉన్నాయి. ఈ ప్రదేశం వన్యప్రాణులకు, గబ్బిలాలకు నివాసంగా ఉంది. ఈ గబ్బిలాలు భయానకంగా ఉంటాయి కానీ మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగలో పురుషులు మరియు స్త్రీలు సమానంగా పాల్గొంటారు.

మనం చికెన్ వండుకోవడం ఎలా సాధారణమో..వారికి గబ్బిలం మాంసం అలా సర్వసాధారణం..ఇంటికి వచ్చిన చుట్టాలకు ఇది పెట్టడమే కాదు..పండుగ తర్వాత మిగిలిన మాంసాన్ని , తర్వాత వాడుకోవడానికి వీలుగా నిల్వ చేసుకుంటారు. వీటి మాంసంలో ఔషధ గుణాలు ఉంటాయని మిమి గ్రామస్తుల విశ్వాసం.అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఈ పండుగను తిలకించేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తారు..

గ్రామస్తులు వాటిని వేటాడడం, విందు భోజనంగా వండుకుని తినడం ప్రత్యక్ష్యంగా చూడవచ్చు.. ఆ గబ్బిలాలు భయంకరంగా ఉంటాయి కాని మనుషులకు ఏ హాని తలపెట్టవట..సో  మీకు కూడా ఇంట్రస్ట్ ఉంటే, కరోనా కలకలం అప్పటికి తగ్గితే అక్టోబర్ లో ఒకసారి చలో మిమి టూర్ వేయండి.. మిమి గ్రామానికి చేరుకోవాలంటే ముందుగా నాగాలాండ్ యొక్క ముఖ్య నగరమైన దిమాపూర్ కు వెళ్లి అక్కడి నుండి కిపైర్ కి..అక్కడ ప్రైవేట్ బస్ లేదా టాక్సీ తీసుకుని మిమికి వెళ్లొచ్చు..సింపుల్..

పోయినేడాది కేరళలో వచ్చిన నిఫా వైరస్, ఇప్పుడు  వచ్చిన కరోనా వైరస్ రెండూ గబ్బిలాల వలనే వచ్చాయని అంటున్నారు..మరి వీళ్లు ఏకంగా పండుగే చేసుకుంటున్నరు..వారికి ఏం కావట్లేదేంటో అని  ఆశ్చర్యపోతున్నారా?? అందరిది అదే పరిస్థితి..


You may also like