Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.
Video Advertisement
దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు.
ప్రేక్షకులు నిరాశ పడకుండా ఉండేలాగా ఎలివేషన్స్, డైలాగ్స్ బలంగా ఉండేలా చూశారు. ఏది ఏమైనా ఈ సినిమా నష్టాల్లో ఉందంటున్నారు ఇమంది రామారావు గారు. సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయ్యింది కానీ వసూళ్లు మాత్రం లేవన్నారు ఇమంది రామారావు గారు.
ఈ సినిమా కథనం కొత్తగా ఉంది కానీ కథ మాత్రం కొత్తగా లేదని చెప్పారు. ఎక్కువ కొత్తదనం ఇందులో ఏమీ లేదని… దీని వలన సినిమాకే ఎక్కువ వసూళ్లు రాలేదన్నారు. అలానే ఈ సినిమాలో పెద్దగా ప్లస్ అయిన అంశాలు కూడా లేవన్నారు. అయితే చిరంజీవి నటించిన ఈ గాడ్ ఫాదర్ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా…30 కోట్లు నష్టం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
సినిమా కథను ఎలా ముందు అనుకున్నారో అలా తీసేస్తే సినిమా బాగుండేదేమో. అనవసరంగా మార్పులు చేయడం వల్ల సినిమా అంత బాగా ఆకట్టుకునే లేదేమో..? అయితే డైరెక్షన్ అంతా బాగున్నప్పటికీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది ఈ సినిమా అని ఇమంది రామారావు గారు అన్నారు. గాడ్ ఫాదర్ మీద చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫలించలేదని చెప్పారు.
End of Article