“పసివాడి ప్రాణం” సినిమాకి ముందు… “మెగాస్టార్ చిరంజీవి” తన ఫ్యాన్స్ కి రాసిన ఈ లెటర్ చూశారా..?

“పసివాడి ప్రాణం” సినిమాకి ముందు… “మెగాస్టార్ చిరంజీవి” తన ఫ్యాన్స్ కి రాసిన ఈ లెటర్ చూశారా..?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగుతూ టాలీవుడ్ ఇండస్ట్రీని నెంబర్ వన్ హీరోగా నిలిచారు.

Video Advertisement

కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి మెగాస్టార్ గా మారారు. రీ ఎంట్రీలో ను యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పసివాడు ప్రాణం సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి అభిమనులకి రాసిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లెటర్ లో ఏం రాశారో ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి కెరిర్‏లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో ‘పసివాడి ప్రాణం’ సినిమా ఒకటి. ఈ చిత్రానికి  దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి, హీరోయిన్ గా నటించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. కె.చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమాన హీరోలతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అప్పట్లో అభిమానులు హీరోలకు లెటర్స్ రాసేవారు. ఇక హీరోలు కూడా తమ అభిమానులకు తన సినిమాల గురించి లెటర్స్ రాసేవారు. దానికి నిదర్శనమే మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం ముందు అభిమానులకు రాసిన లెటర్. చిరంజీవి ఆ లెటర్ లో తన సినిమాల గురించి తెలిపారు.
“ప్రియమైన అభిమానులకు గీతా ఆర్ట్స్ నిర్మించిన “పసివాడి ప్రాణం” ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. డినిలో ఓ కొత్త తరహా క్యారెక్టర్ నటించాను. ఈ సినిమా పై మీ అభిప్రాయం తెలుపండి. రోజా మూవీస్ వారి చిత్రం 18-7-87న ప్రారంభమైనది. తదుపరి రిలీజ్ కాబోయే చిత్రం “స్వయంకృషి” రీరికార్డింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్, దేవి ఫిలిమ్స్ షూటింగ్స్ జరుగుతున్నవి. నా బర్త్ డే విషయం ఇంకా నిర్ణయించు కోలేదు. నిర్ణయించుకున్న తరువాత మీకు ఏ విషయం లెటర్స్ ద్వారా ముందుగా తెలుపబడుతుంది. ఈ లెటర్ తో పాటు అరవింద్ గారి “పసివాడి ప్రాణం” కలర్ స్టిల్ పంపుతున్నాను. ఉంటాను.. సదా మీ అభిమానాన్ని ఆశించే మీ చిరంజీవి” అని రాశారు.

Also Read: “విక్ట‌రీ వెంక‌టేష్‌-రాజ‌మౌళి” కాంబోలో ఆగిపోయిన సినిమా అదేనా..?? కారణమేంటంటే..??


End of Article

You may also like