ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. స్వసక్తితో పైకి ఎదిగిన చిరంజీవి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్ సాధించారు.

Video Advertisement

చిరంజీవి స్వశక్తితో సంపాదించిన ఆస్తి విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సింది. ఇంతకీ మెగాస్టార్ వెహికల్స్ కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం పదండి…

చిరంజీవి ఇప్పటికే 150 చిత్రాలకు పైగా నటించారు. చిరంజీవి వాడే కార్లు చాలా వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్ కారులో ఉంటాయి. అతని దగ్గర ఉన్న కార్ కలెక్షన్స్ లో ఎక్కువ శాతం బ్రిటన్ మరియు జర్మనీ నుంచి తెప్పించినవి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ చిరంజీవి కలెక్షన్ లో ఉంది. సుమారు ఎనిమిది కోట్ల వెలుగు చేసే ఈ కారుని రామ్ చరణ్ తన తండ్రి 53వ పుట్టినరోజు బహుమతిగా అందించారు.

అలాగే చిరంజీవి గ్యారేజ్ లో రెండు టయోటా ల్యాండ్ క్రూసియస్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఇండియన్ మార్కెట్ నుంచి తెప్పించగా మరొకటి నేరుగా విదేశం నుంచి దిగుమతి చేయబడింది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో టఫెస్ట్ కార్ ఆయన రేంజ్ రోవర్ వోగ్ కూడా చిరంజీవి కలెక్షన్స్ లో భాగమే. వీటితో పాటుగా ఫ్యామిలీ ట్రిప్స్ కు వెళ్లడానికి చిరంజీవికి సొంతంగా ఒక ఖరీదైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

ఇక చిరంజీవి ఆస్తి వివరాలకు వస్తే…హీరోగా ఎదుగుతున్న దశలోని 1988 లో తన తమ్ముడు నాగబాబు తో కలిసి అంజన ప్రొడక్షన్స్ హౌస్ ను స్థాపించారు. చిరంజీవి తన కుటుంబంతో నివాసం ఉంటున్న బంగ్లా ఖరీదు సుమారు 30 కోట్ల వరకు ఉండవచ్చు. స్థిరచరాస్తులతో అంతా కలుపుకుంటే చిరంజీవి ఆస్తి విలువ సుమారు 1650 కోట్లు అని అంచనా.

ALSO READ : చిరంజీవి సినిమా ఫ్లాప్ అయ్యింది అనడంతో… ఈ నెటిజన్ తల్లి రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!