Ads
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అందించే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు ఇది. ఏదైనా రంగంలో అసాధారణమైన సేవలు చేసిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఇద్దరు తెలుగు వాళ్ళకి ఈ అవార్డు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందం నెలకొంది.
Video Advertisement
చిరంజీవి కైతే నిన్న ఉదయం నుంచి అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తింది. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరు చిరంజీవిని స్వయంగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక తెలుగువాడిగా చిరంజీవికి ఈ అవార్డు రావడం గర్వ కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘పద్మవిభూషణ్’ దక్కిన తర్వాత చిరంజీవి ఇలా స్పందించారు.. ‘‘నా తల్లి కడుపున పుట్టకపోయినా మీ సొంత మనిషిలా.. మీ అన్నయ్యలా, మీ బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను.. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.. ప్రతిష్టాత్మకమైన అవార్డు ‘పద్మవిభూషణ్’కు తనను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు.’’అని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వీడియో చూసేయండి.
Jai Chiranjeeva #PadmaVibhushanChiranjeevipic.twitter.com/CsApl7uXL5
— Megastar Chiranjeevi (@ChiruFanClub) January 25, 2024
End of Article