Ads
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారిన వ్యక్తి. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన ఈ స్టార్ తన డాన్సులతో ఒక తరాన్ని ఉర్రూతలూగించాడు. కేవలం ఒక తరహా సినిమాలకు ఫిక్స్ అవ్వకుండా అన్ని రకాల క్యారెక్టర్లు నటించి మెప్పించాడు చిరంజీవి.
Video Advertisement
అయితే సినిమా కోసం సినిమాలో పాత్రలు డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు చిరంజీవి.అందుకు ఉదాహరణగా ఈ సంఘటన చూద్దాం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 1997లో అంజి అనే సినిమాని ప్రారంభించారు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి. అప్పట్లోనే ఈ సినిమాని భారీ బడ్జెట్లో ప్లాన్ చేశారు శ్యాంప్రసాద్ రెడ్డి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ని చాలా అద్భుతంగా చూసేవారు ప్రేక్షకులు. ఆ రోజుల్లోనే 25 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 2004లో విడుదల అయింది.
సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ ని ఉపయోగించారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో చిరంజీవి మాసిపోయిన చొక్కాతో కనిపించాలి అయితే కేవలం క్లైమాక్స్ సీన్ తీయటానికి కోడి రామకృష్ణ కి రెండు సంవత్సరాలు పట్టింది. దీంతో చిరంజీవి రెండు సంవత్సరాలు ఉతకకుండా ఒకే షర్ట్ ని వేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ఆ తర్వాత అరుంధతి సినిమాతో కోలుకున్నారు అది వేరే విషయం కానీ ఒక సినిమా కోసం అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఒక చొక్కాని రెండేళ్లు వాడటం అనేది మామూలు విషయం కాదు. డెడికేషన్ అంటే అది అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజెన్స్.
End of Article