“తాను నేను .. కాలం మారినా…” అంటూ చిరు పోస్ట్…ఫోటో వెనకున్న ఆసక్తికర విషయం ఇదే!

“తాను నేను .. కాలం మారినా…” అంటూ చిరు పోస్ట్…ఫోటో వెనకున్న ఆసక్తికర విషయం ఇదే!

by Anudeep

మొన్నటికి మొన్న బి ద రియల్ మాన్ ఛాలెంజ్ పేరిట మన సెలబ్రిటీలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..అవును ఎప్పుడు చూడు సినిమా షెడ్యూల్స్ బిజిలో ఉండి, లేట్ నైట్ షూటింగ్స్, ఔట్ డోర్స్ అంటూ గడిపే మన సినిమా వాళ్లకి లాక్ డౌన్ బాగా కలిసొచ్చిందని చెప్పాలి.. మెగాస్టార్ చిరంజీవి కూడా వాళ్లమ్మకి దోసెలు వేసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది..ముఖ్యంగా ఆ దోసెని గాల్లో ఎగరేయడం ఏదైతే ఉందో.. సూపర్ అంతే.. కానీ ఇఫ్పుడు చిరు పెట్టిన ఒక ఫోటో గురించి  స్పెషల్ గా మాట్లాడుకోవాలి..

Video Advertisement

తాను నేను .. కాలం మారినా..దేశం మారినా” అంటూ క్యాఫ్షన్ రాసి, భార్య సురేఖతో ఉన్న ఫోటో ఒకటి శేర్ చేశారు మెగాస్టార్..1990లో అమెరికాలో దిగిన ఫోటొని జాయ్ ఫుల్ లైఫ్ అంటూ…2020లో జైల్ ఫుల్ లైఫ్ అంటూ సేమ్ పొజిషన్లో ఫొటో దిగి  కరోనా డేస్ ని అభివర్ణిస్తూ ఫోటో పెట్టారు. సేమ్ కలర్ క్యాస్టూమ్స్, కిచెన్, చిరు చేతిలో గరిట, సురేఖ చేతిలో పోపుల పెట్టె.. ఐడియా ఎవరిదో కాని, పిక్ మాత్రం అదిరింది అంతే . చిరు, సురేఖల అన్యోన్య దాంపత్యం గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు..కానీ ఈ ఫోటో చూస్తుంటే వారి అన్యోన్యత మరోమారు అద్దం పడుతోంది.

మెగాస్టార్ ఇటీవల సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచారనే విషయం తెలిసిందే..అప్పటి నుండి తను పెట్టే ప్రతి ఫోటో లేదంటే, పోస్టు విపరీతంగా వైరలవుతున్నాయి..తన డ్యాన్స్, నటనతోనే కాదు, చలోక్తులతో కూడా ఆకట్టుకుంటున్నారు చిరు.. చిరు పెట్టిన ఈ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.. ఆసమ్ అంటూ కొందరు, చిన్నప్పుడు, ఇప్పుడు మీరే మా హీరో అంటూ మరికొందరు, అన్నయ్యా నువ్ సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.


You may also like

Leave a Comment