Ads
మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో , నలుగురు హీరోల్లో ఒకడిగా ఇలా తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.
Video Advertisement
అయితే చిరంజీవి ఇంకా నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే అంటే.. సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖ ను చిరంజీవికి ఇచ్చి 20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. వీరి పెళ్లి మద్రాస్ లో జరిగింది.
అయితే గతం లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరంజీవి తన పెళ్లి నాటి సంగతులను పంచుకున్నారు. ” సురేఖను నాకు ఇచ్చి పెళ్లి చేసే విషయం లో అల్లు రామ లింగయ్య గారు చాల విషయాలు ఆరా తీశారు. అప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. కానీ నన్ను ఈ పెళ్ళికి ఒప్పించారు. మా వివాహం కుదిరాక కూడా నేను సురేఖతో ఎక్కువ మాట్లాడలేదు.” అని చిరు చెప్పుకొచ్చారు.
అలాగే పెళ్లి సమయం లో కూడా పెద్ద హడావుడే జరిగింది అని చిరంజీవి వెల్లడించారు. ‘ఆ టైమ్‌లో నేను నూతన్ ప్రసాద్‌తో కలిసి ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమా చేస్తున్నా అప్పుడు షూటింగ్ నుంచి నేరుగా రావడంతో చిరిగిన బట్టల తోనే తాళి కట్టాను.’ అని చిరు తెలిపారు.
అయితే చిరు పెళ్లి అయ్యి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరికి ముగ్గురు పిల్లలు. కేవలం హీరోనే కాకుండా స్వచ్ఛంద కార్యక్రమాలను చిరంజీవి ప్రారంభించారు. రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. అలాంటి ఎన్నో ఘనతలు సాధించిన మన మెగాస్టార్ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆనతి పెళ్లి పత్రికని చూడండి.
End of Article