Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలంటే మంచి క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియన్స్ కూడా తమ అభిమాన హీరోలు కలిసి నటిస్తే చూడాలని ఆరాటపడుతూ ఉంటారు.
Video Advertisement
అయితే సీనియర్ హీరోలైన చిరు, వెంకీ, బాలయ్య, నాగార్జున లాంటివారు కలిసి నటించడం చాలా అరుదు.వీరందరూ కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఆడియన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వెంకీ, చిరు కలిసి నటించడానికి ఓకే చెప్పేసారు.పూర్తి వివరాలలోకి వెళ్తే…
వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి వెంకటేష్ ఒకరి సినిమాలో డైలాగులు ఒకరు చెప్పుకుని ఆడియన్స్ ను అలరించారు. అలాగే ఇద్దరు తమ మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అదేంటంటే వెంకీ, చిరు కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నామని దర్శకులు మంచి కథను తీసుకురావాలని సూచించారు.
ఈ వార్త విని ఆడియన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ కూడా స్పందించి వెంకీ చిరు సినిమాకి కథను రెడీ చేస్తే ఈ సినిమా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది.మా హీరోలు ఇద్దరు కలిసి నటించడానికి ఓకే చెప్పేసారు…ఇక అంతా దర్శకుల చేతిలో ఉంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు
End of Article