ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఎలా చనిపోయింది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?

ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఎలా చనిపోయింది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

చిత్తూరు జిల్లాలోని పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భవ్యశ్రీ మృతదేహన్ని బావిలో స్థానికులు గుర్తించారు. అయితే మృతదేహం ఉన్న కండిషన్ పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Video Advertisement

భవ్యశ్రీ అనుమానాస్పదంగా మరణించడం చిత్తూరు జిల్లా అంతటా ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇంటర్ విద్యార్థిని మృతిపై సందేహాలు ఉన్నాయని కుల సంఘాల లీడర్లు రోడ్డు పై నిరసనలు చేస్తున్నారు. దారుణంగా వేధించి, చంపేశారని, న్యాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెనమూరు పీఎస్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.
సాక్షి కథనం ప్రకారం, వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల కుమార్తె భవ్యశ్రీ (16) పెనుమూరులో ఒకప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే భవ్యశ్రీ సెప్టెంబర్ 17 రాత్రి కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిసిన చోట్లలో అమ్మాయి కోసం ఎంత వెతికినా భవ్యశ్రీ ఆచూకీ తెలియలేదు. దాంతో 18న  భవ్యశ్రీ తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 20న ఆ ఊరిలో వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక బావిలో భవ్యశ్రీ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం చిత్తూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. పోలీసులు ఫోరెన్సిక్‌ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు యువకులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
అయితే పోస్టుమార్టంలో బాధితురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవనే విషయం ప్రాథమికంగా తెలిసినట్టు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. ఆమె పై అఘాయిత్యం కానీ, విషప్రయోగం కానీ, జరిగిందా అనేది పరీక్షించడానికి  సాంపిల్స్‌ ను తీసుకున్నట్లు వెల్లడించారు. బావిలో మునిగి ఊపిరాడక మరణించిందా? లేదా వేరే ఎక్కడైనా చంపి, ఆమె మృతదేహాన్ని తెచ్చి బావిలో పడేశారా అనే విషయం నిర్ధారించడం కోసం స్టెరమ్‌బోన్‌ సాంపిల్స్‌ను సేకరించి కెమికల్‌ అనాలసిస్‌ చేయడం కోసం తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, ఈ విషయంపై భవ్యశ్రీ తల్లిదండ్రులు మాట్లాడుతూ, “మా అమ్మాయి మృతదేహం బావిలో లభించిన తర్వాత పోలీసులు నీటిని వెలికి తీయడంతో తల వెంట్రుకలు బయటికి పడ్డాయని చెప్పారు. అసలు ఆ వెంట్రుకలు ఎలా ఊడిపోయాయి. గుండు కొట్టి, మా అమ్మాయికి చిత్రహింసలు పెట్టి పడేసారు. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు” అని అన్నారు.

Also Read: తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది ఏమో..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

 


End of Article

You may also like