ఉపాధి కోసం చాలామంది పొరుగు ఊరికి ,పొరుగు రాష్ట్రానికే కాక, పొరుగు దేశానికి కూడా వెళ్లి సెటిల్ అవ్వాల్సిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సొంత ఊరుకి, కన్న తల్లిదండ్రులకు చాలామంది దూరంగా ఉంటున్నారు.

Video Advertisement

అదే విధంగా దుబాయ్ లో సెటిల్ అయిన ఒక యువకుడు మూడేళ్ల తర్వాత సొంతూరికి రావడంతో…. అతని తల్లి ఎంతో ఆనందించారు.

mother and son incident in udupi

అది కూడా అతని వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ గా వచ్చాడు… కేవలం తన ఫ్రెండ్ కు మాత్రం తను వస్తున్న విషయం తెలియజేసి…ఫ్రెండ్ తో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా అమ్మ చేపలు అమ్మే కొట్టు వద్దకు చేరుకున్నాడు. మూడేళ్ల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన కొడుకుని చూసి ఆ తల్లి ఎమోషనల్ అయింది. నేరుగా తల్లి దగ్గరకు వెళ్లిన అతను ఆమెను ఆటపట్టించడం కోసం ముఖం చూపించకుండా అడ్డుగా రుమాలు చుట్టుకున్నాడు.

mother and son incident in udupi

ఆమె వద్ద చేపలు కొనడానికి వచ్చిన వ్యక్తి లాగా బేరసారాలు చేస్తూ ఉండగా అతని తల్లి అతన్ని ఇట్టే పసిగట్టేసింది. ఇక ఆ తరువాత కొడుకుని హత్తుకున్న తల్లి భావోద్వేగానికి గురి అయింది. ఈ సంఘటన కర్ణాటకలోని ఉడుపిలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాన్ని అతనితో ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు…దుబాయ్ కి తిరిగి వెళ్ళాక ఈ వీడియోని ఎడిట్ చేయాలి అని భావించిన రోహిత్ ఆ సంగతే మర్చిపోయాడు.

mother and son incident in udupi

ఈ విషయాన్ని పంచుకుంటూ అతను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోని పోస్ట్ చేసిన వెంటనే వేరొక వ్యక్తి దీన్ని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది తెలుసుకున్న అతని పక్కింటి వ్యక్తి… సామాజిక కార్యకర్త అయిన రమేష్ ఖార్వీ ఆ వీడియోని తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు. అతని ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోకి సుమారు 1.1 మిలియన్ న్యూస్ వచ్చాయి అంటే ఆ వీడియో ప్రజలను ఎంతగా ఆకట్టుకుందో చూడండి. అయితే రోహిత్ ఖార్వీ మాత్రం ఈ వీడియోను ఒక జ్ఞాపకంగా తీసుకున్నానే తప్ప వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కాదు అని తెలియపరిచారు.

watch video :

ALSO READ : “తండ్రి ముందు ఇదేం పని..?” అని తిట్టారు..! కానీ అసలు విషయం ఏంటంటే..?