ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల వల్ల చాలామంది  పాపులర్ అవుతున్నారు. దీంతో నెట్టింట్లో ఫేమస్ అవ్వడం కోసం ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు షేర్ చేస్తున్నారు.

Video Advertisement

కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ రీల్స్ చేస్తే, కొంతమంది తమ కుటుంబంతో కలిసి వంటలు, డ్యాన్స్, చిలిపి పనులు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాటిలో చాలా వరకు వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. వాటిని చూసినవారు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక చిలిపి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి బెడ్ పై కూర్చుని టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు తండ్రి కూర్చున్న బెడ్ పక్కనే నేల మీద కూర్చుని అతను చేసిన పనికి ఎవరైనా నవ్వకుండా ఉండలేరు.  తండ్రి టీవీ చూడడంలో నిమగ్నం కావడంతో, కుమారుడు మద్యం బాటిల్, ఒక గ్లాసు తీసుకుని బెడ్ పక్కనే కూర్చుని,  గ్లాస్ లో మద్యం పోస్తున్నాడు. అయితే కుమారుడు చేస్తున్న పనిని ఆ తండ్రి గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ కొడుకు తాగుబోతు అని అనుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అతనికి మద్యం తాగే అలవాటు లేదట. సరదాగా ఆ వీడియో చేస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఎస్_కింగ్ 746 పేరుతో ఉన్న అకౌంట్ లో వారం క్రితం షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే టైమ్ లో ఈ వీడియోను 14 లక్షల మంది లైక్ చేసారు. నెటిజెన్లు ఈ వీడియోకి రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ ‘అన్నయ్యా నిమిషం లేట్ అయితే మీ తండ్రి కూడా వాటాకి వచ్చేస్తారు‘ అంటూ కామెంట్ చేశారు. ‘అన్నయ్యా ఒంటరిగా డ్రింక్ చేస్తే నాన్నకి  కోపం వస్తుంది’ అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశారు.

Also Read: బిగ్ బాస్ రైతు బిడ్డ “పల్లవి ప్రశాంత్” కు అన్ని ఆస్తులు ఉన్నాయా..?