Ads
జస్టిస్ ఫర్ భవ్యశ్రీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
Video Advertisement
పెనుమూరు మండలంలోని వేణుగోపాలపురంలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో వాస్తవాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏఎస్పీ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ భవ్యశ్రీ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 18న భవ్యశ్రీ తండ్రి తన కుమార్తె అదృశ్యం అయ్యిందని స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారన్నారు. దాంతో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి, ఎంక్వైరీ మొదలుపెట్టామని అన్నారు. ఒక బావిలో సెప్టెంబర్ 20న ఒక యువతి మృతదేహం దొరికిందని, ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
భవ్య శ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తె పై అఘాయిత్యం చేసి, చంపేశారని ఆరోపించారని చెప్పారు. నలుగురి పై సందేహం ఉందని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నామని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రుల ఎదుటే మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ చేశారని, మృతురాలి శరీరం పై ఎటువంటి గాయాలు లేవని, అఘాయిత్యానికి ఏమైన పాల్పడి ఉంటారనే సందేహంతో మృతురాలి నుండి శాంపిల్స్ సేకరించి, తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించామని తెలిపారు. ఎవరైన ఊహాగానాలు, అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు.
ఎస్పీ రిషాంత్ రెడ్డి భవ్యశ్రీ మృతి పై ట్వీట్ చేశారు. అందులో “పెనుమూరులో కలకలం రేపిన 16 సంవత్సరాల అమ్మాయి అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసులో సామాజిక మధ్యమలలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఆ అమ్మాయి పై ఎలాంటి అత్యాచారం లేదా శరీరం పై గాయాలేమి లేవు అని అన్నారు. గుండు కొట్టి అమ్మాయిని చంపారు అనేది నిజం కాదని, ఊడిపోయిన జుట్టు ఆమె మృతి చెందిన బావిలో లభ్యం అయ్యిందని అన్నారు. తల పై కూడా గుండు కొట్టినట్టుగా ఎలాంటి గుర్తులు లేవని” వెల్లడించారు.
#justiceforbhavyashree #truth_chittoorpolice @APPOLICE100 pic.twitter.com/ae5powILyy
— Chittoor District Police (@ChittoorPolice) September 26, 2023
Also Read: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఎలా చనిపోయింది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?
End of Article