ఇటీవల “నూటొక్క జిల్లాల అందగాడు” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో అయిన అవసరాల శ్రీనివాస్ కు బట్టతల ఉంటుంది. ఐతే.. అమ్మాయిల ముందు ఆ బట్టతల కనిపించకుండా విగ్ పెట్టుకుని మేనేజ్ చేస్తూ సినిమా అంతా నవ్వులు పూయించారు. అయితే.. ఈ స్టోరీ రియల్ గా కూడా ఉందండోయ్. కాకపోతే కొంచం డిఫరెంటు. ఈ రియల్ స్టోరీ లో వ్యక్తి అందగాడు కాదు గానీ మహా కేటుగాడు. ఈ వ్యక్తి పేరు కూడా శ్రీనివాసు. పూర్తి పేరు పున్నటి శ్రీనివాస్.

nootokka jillaala ketugadu 1

ఒంగోలు జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ళ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి నాలుగు కోట్ల విలువైన సొమ్ము, లక్ష విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2017 నుంచి ఇతను అనేక సైబర్ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలుసార్లు గంజాయి స్మగ్లింగ్ లో కూడా పాల్గొన్నాడు. వైజాగ్ లో ఉండే నిల్వలను సేకరిస్తూ.. చెన్నై ఏజెంట్లకు అమ్ముకుంటూ ఉంటాడు.

nootokka jillaala ketugadu 2

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ బాగా చదువుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసి ఐఐటి లో ఎంటెక్ సీటు కూడా సంపాదించాడు. ఐతే ఎంటెక్ పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసాడు. బెంగళూరు, చెన్నై లో పలు సంస్థలలో 2017 వరకు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కూడా పని చేసాడు. ఆ తరువాత నకిలీ సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ లను మొదలుపెట్టి అమాయకులైన యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. ఓ సారి ఓ మాట్రిమోనీ సైట్ లో తన బట్టతల కనిపించకుండా.. విగ్ ఉన్న ఫోటో ను అప్లోడ్ చేసాడు.

nootokka jillaala ketugadu 3

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని పెట్టడం తో సంబంధాలు కూడా బాగానే వస్తుండేవి. ఇలా పలువురు అమ్మాయిలకు ఎర వేసి.. వారికి ప్రేమ తో కబుర్లు చెప్పి.. ఎక్కువ మొత్తం లో డబ్బులు ఆన్ లైన్ పేమెంట్ చేయించుకునేవాడు. ఆ తరువాత చప్పుడు లేకుండా మాయం అయిపోయేవాడు. ఇటీవలే నరసారావు పేట కు చెందిన ఓ మహిళా అతనికి నలభై లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఒంగోలు కు చెందిన మరో ఐటి ఎంప్లాయ్ ఏడు లక్షలను ఇచ్చింది.

nootokka jillaala ketugadu 4

ఇలా కష్టపడకుండా డబ్బు వస్తుండడం తో.. శ్రీనివాసు ఇదే వృత్తి గా పెట్టుకున్నాడు. నాలుగేళ్ళ వ్యవధి లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలను కూడగట్టాడని పోలిసుల ప్రాధమిక దర్యాప్తు లో తేలింది. ఎక్కువ మంది బాధితులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోనే ఉన్నారు. శ్రీనివాస్ తాను పట్టుబడకుండా ఉండడం కోసం.. తన బంధువుల పేర్లతో సిమ్ కార్డు లు తీసుకుంటూ, ఫోన్ నంబర్లను మారుస్తున్నాడు. ఈ క్రమం లో పోలీసులు చాకచక్యం గా వ్యవహరించడం తో అతని బాగోతం బయటపడింది.